* లక్షమంది మహిళలకు స్వయంఉపాది అందించుటయే షీరో లక్ష్యం* -- షీరో ఫౌండర్స్ జయశ్రీ తిలక్ _ మహాప్రసాద్ లోగో ఆవిష్కరించిన బాలీవుడ్ హీరోయిన్స్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చాలా మంది మహిళలు అటు ఉద్యోగం చెయ్యలేక ఇటు వ్యాపారం చెయ్యలేక మరోపక్క కుటుంబ అవసరాలకై ఏదేనీ ఓ వ్యాపకం ఇంటినుండే చెసేలా ఎదురు చూస్తున్నవారికి షీరో సంస్థ నేనున్నాను అని బాసటగా నిలుస్తోంది.ఎటువంటి పెట్టుబడి లేకుండా తమ కిచెన్ లో వుండే వంట సామానులతోనే ఇంటి వంటకాల్ని తయారు చేసి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ వచ్చేలా చేసి తద్వారా మహిళలు ప్రతినెలా స్థిరమైన ఆదాయాన్ని పొందేలా షీరో సంస్థ ఎందరో మహిళలకు అండగా ఉంటోంది. ఈపాటికే 3 వేల మందికి ఉపాధి ఇస్తున్న షీరో సంస్థ మహాప్రసాద్ పేరిట మరో బ్రాండ్ ని ప్రారంభించి తద్వారా మహిళలు తాము నిత్యం చేసే స్వీట్స్ స్నాక్స్ పొడులు మరియు నిలవ పచ్చడ్లు ఆన్ లైన్ ద్వారా అమ్ముకొనేలా ఒక వేదికను ప్రారంభించింది. ఈ లోగో ను బాలీవుడ్ హీరోయిన్స్ మౌబాని సర్కార్, ముంతాజ్ సర్కార్, అల్వియా ముఖర్జీ, దనీ బోస్, స్నేహ షా, ప్రీతా మోజెందర్, ఎఫ్ టీ పి సి ఇండియా అధ్యక్షులు చైత...