Skip to main content

Posts

Showing posts from October, 2019

వైద్య రంగంలో సంస్కరణలకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

వైద్య రంగంలో సంస్కరణల అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.  కో చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుజాతారావును నియమించారు. వివిధ విభాగాలకు చెందిన 10 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.  దీంతోపాటు రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చేందుకు సీఎం ఒక కమిటీని నియమించారు. వైద్యవిద్య డైరెక్టర్‌, ఏపీవీవీపీ కమిషనర్‌, మాజీ వీసీ ఐవీ రావు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఎండీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తాము గుర్తించిన అంశాలపై కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈసందర్భంగా..  అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాలపై సంస్కరణల కమిటీ ప్రశంసలు కురిపించింది.

బుమ్రా.. కమింగ్‌ సూన్‌

 వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌  జస్‌ప్రీత్‌ బుమ్రా  కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు.  ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు బుమ్రా.  అదే సమయంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. టీమిండియా యాజమాన్యం కూడా కివీస్‌తో సిరీస్‌కు బుమ్రా సిద్ధమవుతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.   తొందరల్లోనే భారత జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు బుమ్రా. దీనిలో భాగంగా జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్‌ అవుతా అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 'కమింగ్‌ సూన్‌' అంటూ తన ఫోటోకు క్యాప్షన్‌ జత చేశాడు .