Skip to main content

Posts

Showing posts from November, 2019

‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఈ సారి క్రైమ్‌ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్‌ రోల్‌లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్‌ సేథీ, గణేశ్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'రాగల 24 గంటల్లో'చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్‌, ఎంటర్‌టైన్‌ తోడైతే  క్రైమ్‌ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్‌ బేస్డ్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. ఇండియాలోనే నంబర్‌ వన్‌ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌(సత్య దేవ్‌) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్‌ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్‌ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్‌) చేధించాడా? విద్య, ...

బాబు రహస్య ఒప్పందాలు చేసుకున్నారు

 అనంతపురం:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరు మాసాల పాలన అద్భుతమని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్‌కు రెండు కళ్లని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే అమరావతిపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అమరావతిలో నిజంగా అభివృద్ధి జరిగుంటే నారా లోకేష్‌ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టిన చంద్రబాబుకు సింగపూర్‌ వ్యాపారులతో రహస్య ఒప్పందాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి బాబు పారిపోయి వచ్చారని ఆయన పేర్కొన్నారు.  

‘విద్యార్థులకు తెలుగుతో పాటు ఆంగ్లం కూడా ముఖ్యమే’

 విశాఖపట్నం:  రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ విద్యాసంస్థల జాయింట్‌ డైరెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలో...

అందుకే చంద్రబాబు భయపడుతున్నారు: శ్రీకాంత్‌ రెడ్డి

అందుకే చంద్రబాబు భయపడుతున్నారు: శ్రీకాంత్‌ రెడ్డి సాక్షి, వైఎస్సార్‌ జిల్లా :  పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. 'ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్‌ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఏన్టీఆర్‌​ భవన్‌ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్‌ మీడియం కాదా' అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్‌ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని విమర్శించారు. అదే విధంగా మహిళలకు అండగా ఉండాలని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌ దశల వారీగా మద్యపాన నిషేధం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల్లో ...