Skip to main content

Posts

Showing posts from February, 2020

కేసీఆర్ బ‌ర్త్‌డే.. మంత్రి స‌త్య‌వ‌తి ర‌క్త‌దానం

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ 66వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు.  సీఎం బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.  తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌.. ఇవాళ ర‌క్త‌దానం చేశారు.  ఆమె పెద్ద కోడ‌లు సోన‌మ్ రాథోడ్ కూడా ర‌క్త‌దాన శిబిరంలో పాల్గొన్నారు.  ఆదివాసీలు, గిరిజ‌నుల త‌ర‌పున మంత్రి స‌త్య‌వ‌తి .. సీఎం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.    

తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నున్న ట్రంప్‌

 అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  ఈనెల 24వ తేదీన ఆయ‌న తాజ్‌మ‌హ‌ల్ వెళ్ల‌నున్నారు.  ఆగ్రాలో అగ్ర‌రాజ్యాధినేత ప‌ర్య‌టిస్తార‌ని ఆ సిటీ మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ తెలిపారు.  ఖేరియా విమానాశ్ర‌యం నుంచి తాజ్‌మ‌హ‌ల్ రూట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ నిర్వ‌హిస్తున్నారు. తాజ్ ప‌రిస‌ర ప్రాంతాల‌ను కూడా సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నారు.