Skip to main content

Posts

Showing posts from March, 2020

కోల్డ్‌స్టోరేజీలకు ఎర్రబంగారం

ప్రస్తుతం మార్కెట్లో నిలకడగానే ధరలు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అటు  రైతులు, ఇటు వ్యాపారులు శీతలగిడ్డంగుల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని కోల్డ్‌ స్టోరేజీల వద్ద మిర్చి బస్తాలతో వాహనాలు బారులు తీరుతున్నాయి.  ఖమ్మం మార్కెట్‌ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారులో కలిపి 17 కోల్డ్‌స్టోరేజీలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం రూరల్‌ మండలంలో మరో శీతలగిడ్డంగి ప్రారంభమైంది. సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా మార్కెట్లో ఎర్రబంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏకంగా క్వింటాకు రూ.22వేల వరకు గరిష్ట ధర పలికింది. ఎగుమతిదారుల నుంచి భారీగా ఇండెంట్‌ ఉండటంతో స్థానిక కొనుగోలుదారులు పోటీపడి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరాసరి నలభైవేల బస్తాలు వచ్చాయి. అయితే వారం రోజులు గడవకముందే క్రమక్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో స్థానిక వ్యాపారులతోపాటు, ఇతర రాష్టాల వ్యాపారులు, ఖమ్మం నగరం సమీపంలోని చైనా కంపెనీ ప్రతినిధులు మాత్రమే పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చి...

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు: మంత్రి ఈటల

కరోనా వైరస్‌(కోవిద్‌-19) నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి వివరాలు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయనీ, వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలంతా పార్కులు, మాల్స్‌, వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలనీ, అనవసరంగా జనసమూహంలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచనలు చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.  రాష్ర్టానికి వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6 కరోనా కేసులు నమోదయ్యాయనీ,  ఇటీవల స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు మంత్రి తెలియజేశారు. కరోనా సోకిన వారందరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలు కరోనాపై హై అలర్ట్‌ ప్ర...