"అగాధమగు జలనిధిలోనా ఆణిముత్యమున్నటుల శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే" "చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో లోకమనే పడవలో ఏ దరికో.. ఏ దెసకో... జాలరి వలలో చేపవు నీవే...! గానుగ మరలో చేపవు నీవే...! జాలే లేని లోకంలోనా... దారే లేని మనిషివి నీవే" "కలిమి నిలువదు - లేమి మిగలదు కలకాలం ఒకరీతి గడవదూ... నవ్విన కళ్లే చెమ్మగిల్లవా! వాడిన బతుకే పచ్చగిల్లదా! ఇంతేరా జీవితం - తిరిగే రంగుల రాట్నామూ....!" "ఉందిలే మంచికాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా...! అందరికోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరు కలసి సహకారమే మన వైఖరి అయితే... ఉపకారమే మన ఊపిరి అయితే..." పై సాహిత్యం శ్రీశ్రీ ఆయా సందర్భాల్లో సినిమాల కోసం రాసినది. మనదగ్గర సినిమా సాహిత్యానికి ఇప్పుడు విలువలేదు. కానీ అది ప్రజలకు బలమైన సందేశాన్ని అందించే మార్గంగా ప్రజల్లోకి ఇలాంటి వ్యక్తికరణల్ని ప్రవేశపెట్టాడు. ఉద్యమాల సంధి కాలంలో సాధారణ పౌరుడు మొదలు ప్రతి ఉపాధ్యాయుడి నోట శ్రీశ్రీ కవిత్వం అలా రాలిపడేదంటే అతని ప్రభావం ఎలా ఉండేదో మనం ఒక అంచనాకు రావొచ్చు. దాదాపు చాలా మంది కవుల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో శ్రీశ్రీ ముద...