కోవిడ్ పరీక్షలు

కోవిడ్-19 ర్యాపిడ్ యాంటీ బాడీస్ పరీక్షలు నిర్వహణ :-
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆదేశాల ప్రకారం ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జెరపల నరసింహ నాయక్ గారి మౌఖిక ఆదేశాల ప్రకారం కోవిడ్ – 19 ర్యాపిడ్ యాంటీ బాడీ పరీక్షలను 92 మందికి నిర్వహించినట్లు మునిసిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి వి రమణ గారు తెలిపారు. తెనాలి పురపాలక సంఘం సచివాలయo 4, 5 లలో రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి, వారికి మనోధైర్యం తెలియజేసినట్లు తెలిపారు. 18 మంది వైద్య అధికారులు విధులు నిర్వహిస్తూ వైద్య పరీక్షలను చేశామని డాక్టర్ బి వి రమణ చెప్పారు. ఒక్కొక్కరికి రెండు నమూనాలు అనగా IGG, IGM పరీక్షలు నిర్వహించి వాటిలో ఏమైనా తేడా ఉంటే తదుపరి పరీక్షలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ డి ఎస్ రమాదేవి, డాక్టర్ డి జీవన లత, డా. కె ప్రేమ చంద్, డా. జాస్తి స్వప్న, డా. పి ఆశా లత, ఆయుష్ వైద్యాధికారులు డాక్టర్ బి శ్రీనివాసరావు, డాక్టర్ యు బి భాస్కరరావు, డాక్టర్ ఎస్ బాల ప్రభావతి, డాక్టర్ అర్చన, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాల చంద్రమౌళి, హెచ్ వి ప్రమీల, పి వెంకటేశ్వరమ్మ, ANM డి విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.