Skip to main content

మంత్రివర్గం సమావేశం ..

*అమరావతి:*


*29-04-2020*


*రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒపి సేవలను యధావిధిగా కొనసాగించాలి*


*ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు*


*జిల్లాల్లో చిక్కుకున్న వారిని స్వంత జిల్లాలకు చేర్చేందుకు కృషి* 


*మంత్రుల బృందం స్పష్టీకరణ*


కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనా పై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం(GOM) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును మంత్రుల బృందం సమీక్షించింది.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఓపి సేవలు అందించడం లేదని సమావేశం దృష్టికి తేగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందించాలని దీనీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రుల బృందం అధికారులకు స్పష్టం చేసింది.


అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కూలీలు వారు రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారా లేక వారి రాష్ట్రాలకు వెళ్ళాలని అకుంటున్నారో తెల్సుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిఓయం అధికారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి  వచ్చే వలస కూలీలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా ఈ మంత్రుల బృందం సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసింది.


ఈ మంత్రుల బృందం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి,హోం మంత్రి యం.సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,  ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, హరికృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,సియంఓ అదనపు సిఎస్ డా‌.పివి రమేశ్,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్,ఐజి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.


*(ప్రచార విభాగం సమాచార శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)*


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...