జేసుదాసు జీవిత విశేషాలు

కె. జె. ఏసుదాసు
భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు.


• జననం కట్టస్సేరి జోసెఫ్ జేసుదాస్
• 1940 జనవరి 10 (వయస్సు: 80  సంవత్సరాలు), ఫోర్ట్ కొచ్చి, కేరళ
• తల్లిదండ్రులు  అగస్టీన్ జోసెఫ్ (తండ్రి), ఆలిస్ కుట్టి (తల్లి)
• వృత్తి గాయకుడు
• క్రియాశీలక సంవత్సరాలు 1955-ప్రస్తుతం
• ప్రసిద్ధులు భారతీయ శాస్త్రీయ సంగీతము , నేపథ్యగాయకుడు
• స్వస్థలం కొచ్చిన్, కేరళ, భారతదేశం
• జీవిత భాగస్వామి ప్రభ
• సంతానం: ముగ్గురు కుమారులు. వారు వినోద్, విజయ్, విశాల్.


జీవితం
కే .జె. యేసుదాసు 1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థన నటుడు. అతనికి నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. యేసుదాసు తన ఐదుగురు పిల్లలలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్చాడు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహ విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన ఏసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. తరువాత అతను తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కె.ఆర్.కుమారస్వామి, సెమ్మంగుడు శ్రీనివాస అయ్యర్ ల వద్ద విద్యనభ్యసించాడు. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాలను పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాలపాలైంది.


కొంత కాలంపాటు అతను వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత చెంబాయ్ వైద్యనాథ భాగవతార్ వద్ద కూడా విద్యనభ్యసించాడు. అతను కొచ్చిన్ లోణి త్రిపురితురలో గల ఆర్.ఎల్.వి. సంగీత అకాడమీ వద్ద గానభూషణం కోర్సును పూర్తి చేసాడు. అతను శ్రీస్వాతితిరునాల్ మ్యూజిక్ అకాడమీలో కె.ఆర్.కుమారస్వామి అయ్యర్ వద్ద కూడా విద్యనభ్యసించాడు.


ప్రారంభ వృత్తి జీవితం:1960లలో


తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 1961 నవంబరు 14 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట "జాతి భేదం మత ద్వేషం" (సంగీతం:ఎం.బి.శ్రీసివాసన్) 1961 నవంబరు 14న రికార్డు కాబడింది. అయినప్పటికీ అతని మొదటి పాట "అటెన్షన్ పెన్నె అటెన్షన్"ను మలయాళ సినిమాలో పాడాడు. అతను తన సినిమా నేపథ్యగాయకునిగా మలయాళ చిత్రం "కాలపదుకై" (1962) తో ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ మొదలైన చిత్రాలలో పాడాడు.


తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ), చుక్కల్లే తోచావే (నిరీక్షణ), సృష్టికర్త ఒక బ్రహ్మ (అమ్మ రాజీనామా), ఆకాశ దేశాన (మేఘసందేశం) లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు.


కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వాడు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్పు పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించాడు.


అతనికి సోవియట్ యూనియన్ లోని వివిధ నగరాలలో సంగీత కచేరీలు చేయడానికి సోవియట్ యూనియన్ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. అతను రష్యన్ పాటను రేడియో కజఖస్థాన్లో పాడాడు.
సలిల్, యేసుదాస్, ప్రేమ్ నాజిర్ ల త్రయం మలయాళ సినిమా పరిశ్రమలో 1970లలో ప్రవేశించారు.


1970లో అతను కేరళ సంగీత నాటక అకాడమీకి అతి పిన్న వయస్కునిగా నామినేట్ చేయబడ్డాడు.


అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు.


అతను 1970, 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు.


రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అతను 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను కూడా అందుకున్నాడు.


అతను ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే ‘హరివరాసనం’ పాట ఎంతో గుర్తింపు పొందింది.


పురస్కారాలు, బిరుదులు
• పద్మవిభూషణ్ :2017
• పద్మభూషణ్  : 2002.
• పద్మశ్రీ  : 1973.
• అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, 1989
• కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు
• సంగీత నాటక అకాడమీ అవార్డు in 1992.
• ఆస్థాన విద్వాన్ ఉడుపి, శృంగేరి,, రాఘవేంద్ర మఠాలు.
• సంగీత సాగరము 1989.
• సంగీత చక్రవర్తి 1988 పల్లవి నరసింహాచారి.
• సంగీత రాజా 1974.
• సంగీత రత్న పాండిచ్చేరి గవర్నర్ ఎం. ఎం. లఖేరా
• స్వాతి రత్నము
• సప్తగిరి సంగీత విద్వన్మణి (2002)
• భక్తి సంగీత శిరోమణి (2002)
• గాన గంధర్వ.
• గీతాంజలి పురస్కారం నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా.
• కలైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్రప్రభుత్వం.
• నేషనల్ సిటిజెన్ అవార్డు 1994.
• కేరళ రత్న 2008 లో జైహింద్ టివి నుంచి
• 2000 లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం.
• యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం 1999.
• భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం
• కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
• కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
• పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం
జాతీయ పురస్కారాలు
• ఏసుదాసు ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. ఇది ఇప్పటికీ ఓ రికార్డు.


సం చిత్రం భాష పాట
• 1972 అచనుమ్ బప్పయుమ్ మలయాళం మనుష్యన్ మాతంగలే
• 1973 గాయత్రి మలయాళం పద్మతీర్థమూ ఒనరు
• 1976 చిత్చోర్ హిందీ "గోరి తెరా గాఁవ్ బడా ప్యారా మైఁతో గయా మారా ఆకే యహాఁ రే"
• 1982 మేఘసందేశం తెలుగు "ఆకాశ దేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా"
• 1987 ఉన్నికలే ఒరు కథా పరయం మలయాళం ఉన్నికలే ఒరు కథా పరయం
• 1991 భారతం మలయాళం రామ కథా గాన లయం
• 1993 సోపానం మలయాళం సోపానం
నంది ఉత్తమ నేపథ్య గాయకుడు
సం చిత్రం పాట
• 2006 గంగ "వెళ్ళిపోతున్నావా"
• 1990 అల్లుడుగారు (సినిమా) "ముద్దబంతి నవ్వులో"
• 1988 జీవన జ్యోతి 
• 1982 మేఘసందేశం "సిగలో"