ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత లేఖ

*ఆంధ్రప్రదేశ్*


_*సీఎం జగన్ కి టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ.*_


★ పింఛను అంటే ఒక ఉద్యోగి తన జీవితకాలం అందించిన సేవలకు ప్రతిఫలంగా పొందేటటువంటి ఆస్తి. 


★ అలాంటి పింఛను చెల్లింపులో ఎలాంటి కోతలూ పెట్టకూడదని చట్టాలు చెబుతున్నా, రాష్ట్రప్రభుత్వం కరోనా వంకతో మార్చినెల పింఛను చెల్లింపుల్లో 50 శాతం కోత పెట్టింది.


★ పింఛను అందుకునే వారంతా 60 ఏళ్ళకు పైబడిన వారే. వీరికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ అని కూడా అంటున్నారు. 


★ అదీ కాకుండా వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు కూడా ఉంటాయి. 


★ అందుకని వీలైతే వీరికి మరింత సాయం అందించాలి.


★ కానీ ఈ రివర్స్ ప్రభుత్వం వారికి చెల్లించే పింఛన్లలోనే 50 శాతం కోత పెట్టింది. 


★ ఇది సబబు కాదని, తక్షణమే 100 శాతం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసాను.