పుస్తక దినోత్సవ శుభాకాంక్షలతో..

*ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు*


*"పుస్తకాల పురుగు" అనే మాటకు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని చెప్పొచ్చు..అంటే అంత ఎక్కువగా ఇష్టం గా సామాజిక బాధ్యత గా పుస్తకాలు చదివే వారని అర్థం అవుతుంది.అమెరికా ,లండన్ లలో చదువుకునే రోజుల్లో రోజుకి కనీసం 18 గంటల సమయాన్ని అధ్యయనం చేయడానికే అంబేడ్కర్ గారు కేటాయించే వారు.ఆయన కీర్తి నేడు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతుంది.1915లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు పి.హెచ్ డి ఇచ్చింది.*


*అంబేడ్కర్ గారు తన ఇంటికి రాజగృహ అని పేరు పెట్టుకున్నారు. రాజగృహ లో తన ఇంటిలోనే కొన్ని లక్షల పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.*


*అంబేడ్కర్ గారు మొట్ట మొదటిసారిగా 1916 మే 9 న "భారత దేశంలో కులాలు వాటి పుట్టుక ,పనితీరు,అభివృద్ధి" రచించారు.ఇది కొలంబియా కాలేజీ స్టూడెంట్స్ కోసం వ్ర్రాసింది.కొలంబియా యూనివర్సిటీ ,న్యూయార్క్ ,అమెరికాలో జరిగిన ఆంత్రోపాలజీ సెమినార్ లో చేసిన ప్రసంగ పాఠం ఇది.*


*డా.అంబేడ్కర్ మొత్తం 53 పుస్తకాలు రచించారు.వాటిలో కొన్ని ఇవి*


*భారతదేశం లో రూపాయి సమస్య*


*బుద్ధ అండ్ హిజ్ ధమ్మ* 


*శూద్రులెవరు* 


*హిందూ మతం లో చిక్కుముడులు*


*గాంధీ ,కాంగ్రెస్ అంటరాని వాని వాళ్ళకు చేసింది ఏమిటి ?*


*ఇండియా - పాకిస్తాన్*


*కుల నిర్మూలన* 


*బుద్ధ మరియు కార్ల్ మార్క్స్* 


*భారత రాజ్యాంగం* 


*రనడే మరియు గాంధీ మరియు జిన్నా* 


*వెయిటింగ్ ఫర్ ఎ వీసా* 


*హిందూ కోడ్ బిల్*


*మూక్ నాయక్ ,బహిష్కృత భారత్ ,జనతా ,ప్రబుద్ధ భారత్ వంటి పత్రికలు కూడా అంబేడ్కర్ ఈ దేశ ప్రజల కోసం సమానత్వం కోసం,దేశాన్ని ప్రబుద్ధ భారత్ గా రూపొందించడం కోసం నడిపారు.*


*నాగసేన బోధి*