పుస్తకం- యామిని దేవి కోడె

//పుస్తకం//


ఒకో పేజీలో ఒకో నేను
అలజడులూ.. అలికిడులూ
మది గదిలో యదసడులు


వినపడుతూ.. కనపడుతూ
అక్షరమై అల్లుకుంటూ..
పుస్తకమంతా మస్తకపు మేధై


బాహువులొదిగి ఆలింగనమై
గుండెను తడిమే నేస్తం తానై
ఒంటరితనమే దూరం తరిమే


ఉరికే జలపాతాల లేలేత నవ్వులై
కారే కన్నీటికథలకు ఓదార్పు తానై
వదల్లేని పదిలమైందీ పుస్తకం


🌺🌺యా"మినీస్"🌺🌺