ఇర్ఫాన్ ఖాన్ కు నివాళి

ఎలా నవ్వుతున్నాడో చూడండి
ఆ నవ్వు మృత్యువును పరిహసిస్తున్నట్టు లేదూ!
వెక్కిరించినట్టుగా లేదూ!
సోకాల్డ్ మనుషుల ఆబతనాల్ని ఎగతాళి చేసినట్టుగా లేదూ!


చివరగా రాసిన ఉత్తరంలో
జీవితమేమిటో ఎంత వివరంగా చెప్పాడూ!
ఇంకా ప్రయాణించాలని అతను 
గట్టిగానే అనుకున్నాడు కానీ 
అతనికే తెలియని అతని మృత్యువు వెంట తీసుకెళ్లడానికే నిర్ణయించుకుంది.


ఇలానే పోతాం మనం కూడా
మనకే తెలియకుండా రేపటిని వదిలేసి
ఎవరూ భుజమ్మీద చెయ్యేసి వెంటరారు
ఒక్కళ్ళమే వెళ్ళాలి
ఇర్ఫాన్ ఖాన్ లానే వెళ్లిపోవాలి
అల్విదా అనుకుంటూ...