Skip to main content

Posts

Showing posts from May, 2020

ప్రజా నాయకుడు జగన్

జననేత జగన్

జయహో జగన్

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాము

బరువు

బరువు అమ్మ మాట బరువు అమ్మ బాట బరువు అమ్మ కడుపు నింపుట బరువు అమ్మ కష్టంలో సహయం బరువు అమ్మను గాంచలేని వెదవలందరికీ అమ్మ బరువు.... పేరుకు గృహ రాణి గుండెనిండా గునపాల వాణి కంటికి నిద్ర కరువైన కష్టజీవి మెుగుడి మురిపాల్లో మౌన రాగిణి బిడ్డల లాలి పాటలకు వెన్నెల వాహిణి...... పలుకు పలుకులో పరుగుల రాణి దుారమైనా భారమైనా ఇంటికి దీపం తానైనా బాధ్యతల వర్షం పతిదైనా సతిగా చక్కబెట్టు సామ్రాజ్యం  తనదైనా... కిరీటాలు నెత్తినెట్టలేదే కీర్తి కిరీటాలు తానాసించలేదే ప్రతిఫలమాసించని పడతి తానై కదలి పోతుంది బ్రతుకు బాటలో వడలి  పోతుంది... బంధాలను భుజాల మెాస్తుా బాధ్యతలతో అడుగులే వేస్తుా కనికరించే మనసు తానై, అమ్మ ప్రేమ పంచగా.... కన్న కడుపు నింప ముద్ద పెట్టలేని  ముదనష్టపు బిడ్డలేలా భుామికి బరువేల వారికి విలువేల.......   -అరుణ సందడి✍

బ్రతుకు తెరువు ఇరకాటం  వలస జీవుల పోరాటం

బ్రతక కరువు కాటకం  బ్రతుకు తెరువు ఇరకాటం  వలస జీవుల పోరాటం  వరుస  ప్రాణాలు కోల్పోవటం  దేశమంతా తనదిగా   దేహమంతా పనిదిగా  ఒదిగి ఒదిగి కరిగి కరిగి  ఎదిగే ప్రతి అణువులోను  వదిలే తన ఊపిరేగా  వలసకూలీలమనే   ముద్ర వదలని దారిద్రమేగా  స్వంత వూరు  వదలి  వున్న గూడు వదలి తట్ట నెత్తిన పెట్టి  పొట్ట చేత పట్టి  కులాన్ని పక్కనెట్టి  కూలన్న పేరు  పెట్టి  కండల్ని కుదవ బెట్టి  బండల్ని పిండి చేసినారుగా  దళారి మాటలకు దగా పడ్డా దమ్మిడీ లేక  ఢీలా పడ్డా ధనవంతులకు అతనే  అండా  దరిద్రానికి అతనిదే అడ్డా పనులు అతనివే  పస్తులూ అతనివే  ఘనులు ఎన్ని ఉన్నా  మానధనులు సున్నా  అతని నుండి పుట్టని రోగం  అతనికి  అంతుపట్టని రోగం  ఆతను  చెయ్యని పాపం  అతని శ్రమకు కరోనా శాపం ఊరికే ప్రాణం పోకూడదు  పొతే వూరిలోనే పోవాలని  ఆతను  ఉరుకుతున్న తీరు  మనకు  ఉబుకుతుంది కన్నీరు అతను  నిర్మించిన నగరాలు  అతనికి  వీడ్కోలు చెపుతున్నాయి  అతన...

ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి ఈ-పాస్‌లు

*ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి ఈ-పాస్‌లు: ఏపీ డీజీపీ కార్యాలయం* అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. పై కారణాలతో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ-పాస్‌లు జారీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in  అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తారు. *కావలసిన డాకుమెంట్స్* 1️⃣Passport size photo 2️⃣Travelers details 3️⃣All passengers id proofs 4️⃣Mail id 5️⃣All Supported documents 6️⃣Cell number 7️⃣Vehicle details *In process ur mobile get OTP verification* *అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించండి*

జామపండు - ఆరోగ్య రహస్యాలు

జామపండు - ఆరోగ్య రహస్యాలు జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు..! 1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు. 2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది. 3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది. 4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. 6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది. 9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది. 10) జామకాయ లో ఉండే పొటా...

ముఖ్యమంత్రి జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్

ముఖ్యమంత్రి జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లైవ్.      రెండవ ఏడాది, మొదటి విడత వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్. Interacting with Farmers via video conferencing, on the occasion of launching first installment of YSR Rythu Bharosa-PM Kisan, for the second year in a row.                                             తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌య‌లో ``వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా - పీఎం కిసాన్‌`` ప‌థ‌కాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి ‌వై. యెస్ జగన్‌ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వివిధ జిల్లా రైతుల‌తో మాట్లాడారు.

మేమంతా నటులం-మాదంతా నటకులం

https://youtu.be/xcGF_V5XkOE మేమంతా నటులం-మాదంతా నటకులం -----------------------------------------------------                      -డా.వెంకట్ గోవాడ మేమంతా నటులం మాదంతా నటకులం నాటకం అయినా, రేడియో అయినా, టీవీ అయినా,  సినిమా అయినా,  షార్ట్ ఫిలిం అయినా,  వెబ్ సిరీస్ అయినా, ఏ ప్రదర్శన అయినా,  ఏ ప్రదేశమైనా, ఏ కళయినా ఏ రూపమైనా, మాదంతా ఒకటే గళం- మేమంతా కళాకారులం.  అందరిలాంటి మనుషులం  కానీ మాలో మానవత్వం ఎక్కువ అందరిలాంటి మనుషులం  కానీ మాలో దయాగుణం ఎక్కువ అందరిలాంటి మనుషులం  కానీ మాలో మంచితనం ఎక్కువ  అందరిలాంటి మనుషులం  కానీ మాలో చైతన్యస్ఫూర్తి ఎక్కువ అందరిలాంటి మనుషులమే  కానీ మాలో సామాజిక బాధ్యత ఎక్కువ అందుకే  గుండెల్లో నీళ్లున్నా  కళ్ళల్లో ఆనందం కురిపస్తాం మనసుల్లో వేదనున్నా  రూపంలో ఆహ్లాదం జొప్పిస్తాం  శ్వాసల్లో వేడి కమ్మినా  ప్రదర్శనల్లో హాస్యాన్నే గుప్పిస్తాం ఎందుకంటే మేమంతా నటులం  మాదంతా నటకులం. కరోనా కట్టడితో  చేతులు కట్టుకు కూర్చోం  భౌతిక దూ...

చిత్రకారులను ప్రభుత్వాలు గుర్తించాలి

చిత్రకళ  సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళాప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదలించి, సమస్యల పట్ల ఆలోచనలను రేకెత్తించి పోరాడమంటుంది. సమస్యలను చూపడమే కాదు పరిష్కారాల బాటలు వేయగలదు. చరిత్ర నిజాలను కన్నుల ముందుకు తీసుకురాగలదు. సమాజాన్ని చక్క దిద్దాలనే ప్రయత్నాలు చేయగలదు. చిత్రకళ మొదట భావ వ్యక్తీకరణ కోసం జన్మించింది. తరువాత తరువాత మతాన్ని ప్రచారం చేసింది. ప్రకృతిని ప్రతిబింబించింది. మనోగత భావాలకు, ధోరణికి ప్రతీకలు చూపి ప్రతిబింబించింది. కరిగిపోయే కాలాన్ని కూడా కన్నుల ముందు చిత్రంగా నిలబెట్టింది. అలాగే సమాజ స్థితిగతులకు తాను కూడా స్పందించింది. నవ్వింది, నవ్వించింది, ఆనందాన్నిచ్చింది. ప్రశ్నించింది, ప్రశ్నలకు బదులిచ్చింది. మనతో కూడా నడుస్తూనే ఉంది. సమస్యలను, లోపాలను, కర్తవ్యాలను గుర్తు చేస్తూ సమాజములో ఒక భాగమైపోయి, తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.   అయితే అటువంటి చిత్రకళ ఆ చిత్రకారుని మానసిక పరిపక్వత మీద, స్పందన పైన ఆధారపడి యుంటుంది. ఒక చిత్రం గొప్పదనాన్ని నిర్ణయించేది కూడా ఆ చిత్రం తెచ్చిన ప్రయోజనమే. అందుకే ఋగ్వేదం “ఆయా కాలాల్లో, ఆయ...

తక్కువ ధరలో అద్భుతమైన రోగనిరోధక శక్తి నిచ్చే పండు బొప్పాయి

*అతి తక్కువ ధరలో అద్భుతమైన రోగనిరోధక శక్తి లభించే పండు ఈ బొప్పాయి పండు.* *1 ) బొప్పాయి లోని A,C మరియు K విటమిన్లు ఇమ్యునో బూస్టర్లు గా పని చేస్తాయి.* *2 ) శరీరంలోని కనజాల వృద్ధికి మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.* *3 ) ఇందులో నీరు మరియు పీచు తగిన ప్రమాణంలో ఉంటాయి.* *4 ) ఫోలిక్ ఆమ్లం, ఫోటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు జింక్ అదనపు శక్తిని ఇస్తాయి.* *5 ) 100గ్రాముల బొప్పాయి లో 40 కెలోరీలు లభిస్తాయి.* *6 ) రోజులో మనకు అవసరం అయ్యే విటమిన్ A లో  20 శాతం మరియు విటమిన్ C లో 70 శాతం ఈ బొప్పాయి ద్వారా లభిస్తుంది.* 7 ) *తక్కువ కెలోరీలు మరియు ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు దీనిని తీసుకోవచ్చు.* *8 )100గ్రాముల బొప్పాయిలో కేవలం చక్కెర కేవలం ఎనిమిది గ్రాములే ఉంటుంది.* *9 ) కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు మరియు వృధ్యాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.* *10 ) బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.* *11 ) తరచూ ఒక గ్లాస్ బొప్పాయి రసం తీసుకుంటే మలబద్దకం ఉండదు.* *12 )ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రీయంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి గుండె జబ్బ...

రాపర్ల లో విషాదం 9 మంది మృతి

రాపర్ల లో విషాదం 9 మంది మృతి. నావులుప్పలపాడు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. మిరపకాయలు కోత పనికి ముగించుకుని  వచ్చి తిరిగి ట్రాక్టర్ లో  ఇంటికి   వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాక్టర్ పై వస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాద వశాత్తు మార్గమధ్యంలో ఉన్న విద్యుత్  హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు. మృతులు అందరూ రాపర్ల గ్రామానికి చెందిన వారు .ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో పడ్డారు. నాగులుప్పలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏపీలో జులై 10 నుంచి ‘పది’ పరీక్షలు

ఏపీలో జులై 10 నుంచి ‘పది’ పరీక్షలు రాష్ట్రంలో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు  దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు  ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్‌తో మాత్రమే పరీక్ష నిర్వహణ 11 పరీక్షల పేపర్లను 6కి కుదించిన బోర్డ్ జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌,  11న సెకండ్‌ లాంగ్వేజ్‌,  జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్‌,  13న గణితం,  14 సామాన్య శాస్త్రం,  15న సాంఘీక శాస్త్రం పరీక్షలు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు.                    - ప్రేమ్ కుమార్. జి. 

తెనాలిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు

తెనాలిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదు  సుల్తానాబాద్ కుమార్ కాలనీ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ కు పాజిటివ్ గా నిర్ధారణ. సుల్తానాబాద్ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు.

విద్యుత్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక నిర్ణయం"

"విద్యుత్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక నిర్ణయం" ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయి.. దీనిపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.. ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

నిర్మలా సీతరామన్ ప్రెస్ మీట్ వివరాలు

* *నిర్మలా సీతరామన్ ప్రెస్ మీట్ * * వివరాలు ** ఆర్థిక ప్యాకేజీ వివరాలు ప్రకటించిన నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. స్వీయ  ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీ వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పన. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగం ఎకానమీ, మౌలికరంగం, టెక్నాలజీ, వనరులపై ఫోకస్ 40 రోజుల్లో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలి పీఎం కిసాన్ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నాం ఉజ్వల వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యాం లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే ముందు ఈ సంస్కరణలను అర్థం చేసుకోవాలి. భూమి, కార్మికులు, నగదులభ్యత, చట్టాలకు ప్రాధాన్యం * పేదలు, వలస కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తాం * లాక్ డౌన్ తర్వాత గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించాం. 41 కోట్ల జన్ ధన్ అకౌంట్లోకి రూ.52,606 కోట్లను నేరుగా జమచేశాం. 71 వేల టన్ను...

రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు 

రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు                                                            - పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి,మే13 : రాష్ట్రంలో షుగర్ పరిశ్రమల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని మంత్రి ఛాంబర్లో పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్ మురళిలతో మంత్రి గౌతమ్ రెడ్డి షుగర్ పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్ కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం  10 షుగర్ ఫ్యాక్టరీలు ఉండగా 6 మూతపడ్డాయని, 4 పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.  ఈ నేపథ్యంలో మూతపడ్డ పరిశ్రమల అభ...

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు 

రైట్..రైట్ .. రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు                         50 శాతం మందితో జర్నీ.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు లాక్ డౌన్ విధిస్తే జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుందని భావించి లాక్ డౌన్ విధించినా కొన్నిటికి సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజా రవాణా కొనసాగేలా ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ ప్రజా రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బస్సులు నడపనున్నారు. అయితే బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్ల సర్దుబాటు చేసేలా ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పీటీడీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను...

ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ 1 కోటి విరాళం.

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్‌జగన్‌కు అందజేస్తున్న లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్. ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జి.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000/- విరాళం . విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్ జగన్‌కు అందజేస్తున్న‌ వారి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ML నారాయణరెడ్డి (జమ్ములమడుగు),  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000/- విరాళం.  విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేస్తున్న ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయనిధికి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన డీడీని  సీఎం  వైయస్ జగన్‌కు అందజేస్తున్న‌ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ.

ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్

.        *ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్*  కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి. 1. *కేటగిరి A*  నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 0 - 50  --->  1.45 51-75 ----> 2.60 *2. కేటగిరి B* నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు  వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 0 - 50      ---->   2.60 51 - 100 ----->   2.60 101 - 200 -----> 3.60 201 - 225 -----> 6.90 *3. కేటగిరి C* నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 0 - 50      ---->   2.65 51 - 100 ----->   3.35 101 - 200 -----> 5.40  201 - 300 -----> 7.10 301 - 400 -----> 7.95 401 - 500 ----->  8.50 500 పైన  ----->   9.95  చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడు...

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఇసుక,మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లకు అధికారుల బదిలీ.. జిల్లాలవారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులగా ఏఎస్పీ లను నియమించిన ప్రభుత్వం.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్.. గుంటూరు రూరల్ - k.ఆరిఫ్ హఫీజ్ తూర్పు గోదావరి - గరుడ్ సుమిత్ సునీల్ విశాఖపట్నం రూరల్ - రాహుల్ దేవ్ సింగ్ విశాఖ సిటీ - అజిత వేజెండ్ల కర్నూలు - గౌతమి శాలి కృష్ణా - వకుల్ జిందాల్ చిత్తూరు - రిషాంత్ రెడ్డి.

ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల అవసరార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన విధి విధానాలు. *ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించుటకు గాను   రిజర్వేషన్ కు  సంబంధించిన వివరాలు* ఈ ప్రత్యేక రైళ్లు లో  కేవలం  రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేక రైలు బయలు దేరే స్థానం నుండి  గమ్య స్థానం చేరే  ప్రయాణ మార్గమధ్యంలో ఎదురయ్యే స్టేషన్లలో మాత్రమే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు తెరవబడతాయి మరియు ఆ కౌంటర్ల వద్ద  ఈ కింద ఉదహరించిన వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఉన్నతాధికారులచే అభ్యర్ధన అనుమతి పొందిన  అత్యవసర నిమిత్తం ప్రయాణించే HOR ప్రయాణికులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, గౌరవనీయమైన సుప్రీంకోర్టు మరియు వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు మరియు సంబంధించిన జాబితా లో గల వ్యక్తులు. ప్రస్తుత మరియు మాజీ MP లు, MLA లు మరియు  MLC లు. స్వాతంత్ర్య సమరయోధులు ఛార్జీలు ముందుగానే చెల్లించబడే  లేదా ...

ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు

*ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు* ```కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.  ప్యాకేజీ సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందన్న దానిపై పారిశ్రామిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆధునిక సాంకేతికతతో సరఫరా గొలుసును బలోపేతం చేయాలన్న ప్రతిపాదన ఈ ప్యాకేజీలో చాలా కీలకమైన అంశంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలో బ్యాంకులకు ఎక్కువగా కేటాయించాలని, బ్యాంకులను రక్షించుకుంటేనే ఆర్థికరంగం ముందుకెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.```

రేషన్‌ కార్డుల్లో మార్పులకు ఛాన్స్

రేషన్‌ కార్డుల్లో మార్పులకు ఛాన్స్ అమరావతి: రేషన్‌ కార్డుల్లో మార్పులు,చేర్పులకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పిల్లల పేర్లను చేర్చడం, వివాహమైన వారికి కొత్తకార్డుల మంజూరు,పేర్ల తొలగింపునకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికే రేషన్‌కార్డు స్థానంలో వార్షిక ఆదాయాన్ని బట్టి బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్‌, విద్యా దీవెన కార్డులను అందజేస్తోంది. కరోనా నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ పాత రేషన్‌ కార్డులపైనే బియ్యం అందిస్తోంది. కొందరు అర్హులకు బియ్యం కార్డులు మంజూరుకాలేదు. మరికొన్నిచోట్ల అనర్హులకు దక్కాయి. వీటిని అధికారులు మరోసారి పరిశీలించనున్నారు. అర్హత కలిగిన వారికి బియ్యం కార్డులు జారీ చేసేందుకు చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరైనా కార్డులో లేకపోతే వారి ఆధార్‌ కార్డును రెవెన్యూ అధికారులకు అందజేయడం ద్వారా రేషన్‌ కార్డులో చేర్చ వచ్చు. కొత్తగా వివాహమైన జంటలు, వారికి పుట్టిన పిల్ల లతో కార్డు పొందాలంటే ఇంత వరకు తల్లిదండ్రులు ఉన్న రేషన్‌ కార్డు నుంచి తొలగించాలి. ఇతర ప్రాంతాల్లో వలసవున్న వారు అక్కడే...

ప్రధానమంత్రి లైవ్

ప్రధానమంత్రి లైవ్.                                      https://youtu.be/0xmx92Q_kQ4                రూ. 20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ: మోదీ దిల్లీ: కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మట్లాడుతూ.. కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోంది. కరోనాపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిది అన్నారు.

దైవాలు

దైవాలు 🙏 దయచుాపని బ్రతుకునీకేలా జాలిగాచుాడని చుాపునీకేలా ఓదార్పుమాటలేని నోరునీకేలా స్పందించలేని గుండె నీకేలా తల్లిదండ్రులగాంచని జీవితమేలా పిడికెడన్నం పెట్టని చేతులేలా మంచివైపు సాగని కాళ్లేలా కనిపించని దైవంకోసం వెతుకులాటేలా ధనమెంతైనా దైవానికేలా మనసుపెట్టిగాంచవా మమతనంతా చుాడవా అమ్మనుమించిన దైవం కలదా? నాన్ననుమించిన త్యాగం కలదా? సత్యమెరిగి నడచుకో నిజదైవాలను కొలుచుకో కష్టమంతా గాంచరా కన్నీటి విలువ చుాడరా కలియుగ కాలాన పుణ్యమంతా నీదిరా..    - అరుణ సందడి✍

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు

ఆ మోములో ఛీత్కారముండదు ఒక్క చిరునవ్వే  ఆ దేహంలో అహంకారముండదు ఒక్క అంకితభావమే  ఆ సేవలో స్వార్థముండదు ఒక్క  వైద్యసాయమే  ఆ నిండు గుణం ఇలపైనున్న ఒక నర్సురూపమే !  అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు   - ఆచంటి శ్రీనివాసరావు

కనిపించే దేవుని రూపాలు నర్సులు

కనిపించే దేవుని రూపాలు నర్సులు   ************************* ఊపిరాడని పిపిఇ సూట్లు  వైద్యానికి సహకరించని రోగులు  కుటుంబానికి దూరంగా నివాసాలు  ఐసోలేషన్ వార్డులో నిరంతర సేవలు  బెడ్ వదిలేసి బయటకు వచ్చే రోగులు  చాలా దగ్గరగా వచ్ఛి మాట్లాడే రోగులు  చీటికి మాటికీ చీకాకు పడే రోగులు  వింత వింత ప్రవర్తనలు చేసే రోగులు  నెలలో ఇరవై రోజులు డ్యూటీ  నిరంతర విధులతో విరామంలేని డ్యూటీ  ఆస్పత్రి సమీప హోటలు నుండి వచ్ఛి చేయవలసిన డ్యూటీ  క్షణక్షణం కరోనా భయంతో చేసే డ్యూటీ  అయినా చిరునవ్వులతో రోగులకు సేవలు  ప్రతిక్షణం అప్రమత్తతతో చేయవలసిన విధులు  ఓర్పుతో అందించవలసిన కరోనా సేవలు  కనుకనే కనిపించే దేవుని రూపాలు నర్సులు  అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి హృదయ పూర్వక అక్షర శుభాకాంక్షలు  - డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, సెల్: 9347537635

కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్...

*టీఎస్ హైకోర్టు.....* కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్... పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కు ప్రభుత్వం అడుకోవలన్న పిటీషనర్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్... కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్... జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్.. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్  డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారీ... పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. తదుపరి విచారణ 2 వారాలకు వ...

*రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ*

*రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ* న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మోదీ నిన్ననే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి చర్చించారు. మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17తో ఇది ముగియనుంది. మార్చి నెల 24న తొలి లాక్‌డౌన్ ప్రకటించారు. నేడు జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఐదోసారి.

కుమార్ పంపులు సంస్థ ఆధ్వర్యంలో  జర్నలిస్టుల కు నిత్యావసర వస్తువుల పంపిణీ

కుమార్ పంపులు సంస్థ ఆధ్వర్యంలో  జర్నలిస్టుల కు నిత్యావసర వస్తువుల పంపిణీ      తెనాలి పట్టణం లో పనిచేస్తున్న పాత్రికేయులకు నిత్యావసర సరుకులు  పారిశ్రామికవేత్త,  కుమార్ మంపులు సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సోమవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక కుమార్ పంపులు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న పాత్రికేయులసేవలు మరువరానివని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త,కుమార్ పంప్స్ అధినేత కొత్తా సుబ్రహ్మణ్యం అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర  ప్రముఖమై నదన్నారు. నిరంతరం ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ,వాటి పరిష్కారానికి కృషి చేసే పనిలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. తన వంతు సహాయంగా కార్యక్రమమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి. రవింధ్రబాబు మాట్లాడుతూ తొలి నుంచి కష్టపడి పైకి వచ్చి పారిశ్రామికవేత్తగా తన ప్రతిభను,నలుదిశలో విస్తరింపజేసారన్నారు.  కొత్త సుబ్రహ్మణ్యం విలేకరుల పట్ల సానుభూతితో సహాయ సహకారం అందించటం ముద...

రవీంద్ర భారతి విశేషాలు

ఈ రోజు రవీంద్రభారతిని ప్రారంభోత్సవం చేసిన రోజు. రవీంద్రభారతిన 23/03/1960 న అప్పటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్, మాజీ ముఖ్య మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. మొహమ్మద్ ప్యాయజుద్దీన్ బిల్డింగ్ ని డిసైన్ చేశారు. ప్యాయజుద్దీన్ లండన్ లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో పట్టభద్రుడు. ఈ భవనాన్ని రవీంద్రనాథ్ టాగోర్ గారి జన్మదిన శతకము సమయములో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిర్మించింది.  రవీంద్రభారతి ని మే 11,1961 న మాజీ ప్రధాన మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు.   ఈ ఆడిటోరియంను 2005 నందు, దాదాపు 44 సంవత్సరాల తరువాత రెనోవేషన్ చేయడం జరిగింది.  రెనోవేషన్ భాగంగా అంతరభాగం లోని గదిని అలంకరించడం, కొత్త లైటింగ్, సౌండ్, ఎయిర్ కండిషన్, స్టేజ్, గ్రీన్ రూమ్ మరియు సీట్లు ఆధునిక  హంగులతో నిర్మించడం జరిగింది. వీటితో పాటు పార్కింగ్ స్థలం, ఆహార శాల మరియు లాండ్స్కేప్ ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రెనోవేషన్ సమయంలో, దాదాపు ఒక నెల రోజులు, ఆడిటోరియం నందు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. దేశ ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటకు ఈ భవనాన్ని ఉపయోగించాలని ఈ భవన నిర్మాణ ...

ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి రోడ్లపైకి బస్సులు?

ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి రోడ్లపైకి బస్సులు? *లగ్జరీలో 26, పల్లె వెలుగులో 34 మందికే చోటు* *ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేస్తున్న పీటీడీ* *ప్రతి డిపో నుంచి 4-12 వరకు బస్సులు సిద్ధం* *నష్టాల భర్తీకి 40-50% చార్జీల పెంపు?* *ప్రయాణికుడి చేతిలో రెండు చుక్కలు శానిటైజర్‌* *ఆ బాధ్యతా డ్రైవర్‌కే.. కండక్టర్‌ ఉండరు..* *ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన పీటీడీ..* *సర్కారు అంగీకరిస్తే ప్రయాణికులపై భారమే* అమరావతి  యాభై రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కెందుకు సిద్ధమవుతున్నాయి. కొవిడ్‌-19 ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్కటిగా సడలింపులు వస్తుండటంతో పీటీడీ(ప్రజా రవాణా విభాగం) అధికారులు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17 తర్వాత మరోమారు కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగించినా, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల వరకూ సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను పీటీడీ సర్దుబాటు చేస్తోంది. సీట్ల కెపాసిటీని సగానికి తగ్గించుకోక తప్పడంలేదు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి 40-50 శాతం టికెట్ల ధర పెంచేందుకు పీటీడీ  ప్రతిపాదనలు పంపినట్లు తెలి...

తెనాలిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

తెనాలిలో తొలి పాజిటివ్ కేసు నమోదు..  తెనాలి ఐతానగర్ కి చెందిన యువకునికి పాజిటివ్ గా నిర్ధారణ ఈ నెల 4వ తేదీన చెన్నై నుండి లారీలో తెనాలి వచ్చిన యువకుడు తెనాలి మొత్తం రెడ్ జోన్ గా అధికారుల ప్రకటన

అమ్మ

అమ్మ ....❤️❤️❤️ గుండె లయలో అమ్మ పాటలు లోలకమై జ్ఞాపకాల గానమౌతాయి గాయాలెన్ని ఓదార్చిందో అమ్మ ఒడి తలనిమిరిన అమ్మ చేతి అనురాగం నిత్యం నాకు నడక నేర్పుతూనే వుంటుంది దూరంగా వున్నా ధ్యాస అమ్మౌతుంది మమతను అనుభూతి స్పర్శలో అల్లుకుంటాను ముక్కలైన రెక్కలు ఇపుడు నొప్పితో మాట్లాడుతుంటాయి అరిగిన అరచేతిలో రేఖలు గజిబిజిగా గతాన్ని గుర్తుచేస్తుంటాయి పరిగెత్తి పనులు చక్కబెట్టి అందరి అవసరాలకు  అంకితమైన ఆ పాదాలే మూడోకర్ర ఆసరాతో తప్పటడుగులేస్తున్నాయి మ్రొక్కని దేవుడు లేడు మొర పెట్టుకోని సందర్భమూ లేదు మనసు మంత్రమై సంచరించిందానాడు ఒక్కోసారి తెరపై బిడ్డను చూసిన వెలుతురు దరహాసం వెంటాడే ఆత్మస్ధైర్యమౌతుంది  అమ్మ ప్రేమ అంతులేనిదై అల్లుకుంటుంది తెరను తాకుతూ నిండైన ఆనవ్వు నిలువెత్తు నమ్మకమై  నిలబెడుతూనే వుంటుంది కాంతి నిండిన కన్నుల్లో నా పసితనాన్ని అమ్మ చూసినట్టుగా నాకేమో పొత్తిళ్ళలో పరిశించిన ఊహ గుండెల్లో అమ్మ బ్రతుకు జాగరూకత నేర్పుతూనే వుంటుంది అమ్మ పసిపాపైయ్యిందిపుడు బోసినవ్వుతో పలుకరిస్తూ ...!!                      -వాణి కొరటమద్ది

రేషన్‌ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.  బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకత, అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. మొబైల్‌ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేయనున్నారు.  ఇందుకోసం అత్యంత నాణ్యతతో కూడిన కాలుష్యరహిత సంచులను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.  రెండు లేదా మూడు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం డోర్‌డెలివరీకి పౌరసరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది.👍👍

ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనది

ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనది..                                      -హోమ్ మంత్రి సుచరిత విశాఖపట్నం ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనదని, ప్రతి ఒక్కరిని ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హోమ్ మంత్రి సుచరిత అన్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు యావత్ భారతదేశానికి ఆదర్శనీయమైనది చెప్పారు. అంతే కాకుండా విశాఖ ప్రజలు, యువత, పోలీస్ యంత్రాంగం, అధికారులు సకాలంలో స్పందించడం వలన దుర్ఘటనలో ఎక్కువమంది ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారన్నారు. కరోనా బాధ్యతల్లో పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నప్పటికి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తీరు ప్రసంశనీయం అన్నారు.  ముఖ్యమంత్రి  ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారన్నారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ప్రకటించిన దాఖలాలు లేవు. అదేవిధంగా తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, అస్వస్థతకు లోనైన వారికి...

తాపీ ధర్మారావు విశేషాలు

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● 🔷క🔷ళా🔷దీ🔷పి🔷<క>🔷ళా🔷దీ🔷పి🔷క ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● కళాదీపిక-సాహిత్య దీపిక ●●●●●●●●●●●●● 'ఆంధ్ర విశారద' తాపీ ధర్మారావు 19-9-1887 ◆ 8-5-1973 (ఈరోజు వారి వర్థంతి) ●●●●క●ళా●దీ●పి●క●●●● తాపీ ధర్మారావు  1887 సంవత్సరంలో  సెప్టెంబర్ 19న  ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న  బెర్హంపూరు (బరంపురం ) లోని  ఒక తెలుగు కుటుంబములో  జన్మించారు.  ధర్మారావు  తల్లి పేరు నరసమ్మ.  తండ్రి అప్పన్న.  వీరి ఇంటి పేరు మొదట్లో  'బండి'లేదా 'బండారు'  కావచ్చును.  అప్పన్న తాత  లక్ష్మయ్య  కొంతకాలం  మిలిటరీలో పనిచేశారు.  తరువాత  తాపీ పనిలో  మంచి పేరు తెచ్చుకొన్నారు.  అలా అతనికి  శ్రీకాకుళంలో  'తాపీ లక్ష్మయ్యగారు' అన్న పేరు  స్థిరపడిపోయిందట. అదే  వీరి ఇంటిపేరుగా మారిందట. ధర్మారావు ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో,  మెట్రిక్యులేషన్ విజయవాడలో,  పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు  చదువుకొని,  మద్రాసులోని  పచ్చయప్ప కళాశాలలో చేరారు.  పర్లాకిమిడిలో చ...

నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్

*నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్..* ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా విచారించిన అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఐదు రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని ఏజీ తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని కోర్టుకు వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఆర్డినెన్స్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. వయసుతో సరిపెట్టడం సరికాదు.. ఇదిలా ఉంటే.. ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు వినిపించారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు....

అభ్యుదయ దర్శకులు టి. కృష్ణ

అభ్యుదయ దర్శకులు టి. కృష్ణ                           నేడు దర్శకులు తొట్టెంపూడి కృష్ణ  వర్థంతి.        ఈ సందర్బంగా ఆయన సినీజీవితం గురించి నెమరు వేసుకుందాం. టి. కృష్ణ సినిమా రంగంలో ఎన్నో విభాగాల్లో పనిచేసారు. ముఖ్యంగా ఎడిటర్ గా, నటుడిగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన తెలుగు సినిమాల్లో ఒక విప్లవం తీసుకోచ్చారు.పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, టి. కృష్ణ కు  మంచి పేరు తెచ్చాయి.  తెలుగు సినిమా రంగంతో పాటు, ఆయన మళయాళం, మరియు కన్నడ ప్రేక్షకులను అలరించారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా "రేపటి పౌరులు".  ఆయన ఎంతోమంది దర్శకులను విప్లవ సినిమాలు దర్శకత్వం వహించేలా ప్రేరణ చేశారు. ఈ కోవలో ఆర్. నారాయణ మూర్తి గారు ముందు అనిచెప్పవచ్చు. కృష్ణ  నాటక రంగాన్ని కూడా చాలా ప్రభావం చేశారు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నాటక రంగ అభివృద్ధికి కృషి చేశారు.

గర్భిణీ స్త్రీలకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి

గర్భిణీ స్త్రీలకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి స్థానిక తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం తెనాలి పరిధిలోని సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశం లో మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ బీజాపూర్ వెంకటరమణ పలు సూచనలు చేశారు. నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు కాన్పు సమయంలో తప్పనిసరిగా పరీక్షలు చేయించాలని తెలియజేశారు. మున్సిపల్ పరిధిలోని కొత్త వారు ఎవరైనా వచ్చినచో వెంటనే ఆరోగ్య సిబ్బంది పరిశీలించి ఎక్కడి నుంచి వచ్చినది సంబంధిత వివరములను కార్యాలయానికి తెలియజేయాలన్నారు. గృహం లోపల ఉండేటట్లు పోలీసు వారి సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలను నిర్దేశించిన కాల ప్రమాణంలో సంస్థాగత ప్రసవాలు జరిగే విధంగా ఆరోగ్య కార్యదర్శి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రేమ్ చంద్ , డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి, ఆయుష్ వైద్యులు డాక్టర్ యు. బి. భాస్కర్ రావు, డాక్టర్ ఎస్. బాలప్రభావతి, డాక్టర్ ఎం. శ్రీనివాస్ నాయక్, డాక్టర్ బి. శ్రీనివాసరావు, ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి, సబ్ యూనిట్ అధికారి వంగల పున్నా రెడ్డి, హెల్త్ విజిటర్ పీ వెంకట...

శుభాకాంక్షలు

మా బాబాయి, సీనియర్ రంగస్థల కళాకారులు, సాంఘిక నాటక దర్శకులు శ్రీ కనపర్తి బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

విశాఖలో గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం సమీక్ష

*విశాఖలో గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం సమీక్ష* *అమరావతి: గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సీఎం సమీక్ష* *క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం* *విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా* *ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్న సీఎస్‌* ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించిన కలెక్టర్‌ ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్‌ అయ్యింది మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుంది దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయి విశాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, పీసీబీ మెంబర్‌సెక్రటరీ వివేక్‌ యాదవ్‌ వస్తున్నారు: ఘటనపై  సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశం కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని సీఎం ఆదేశం కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలన్న సీఎం విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎ...

ప్రభుత్వ వైన్ షాపులో చోరీ

గుంటూరు జిల్లా తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం ప్రభుత్వ వైన్ షాపులో చోరీ అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు రూ.80 వేలు విలువ చేసే 111 మద్యం బాటిళ్లు చోరీ. ప్రభుత్వపు ట్యాబ్ చోరీ  షాపులో అందుబాటులో లేని సీసి కెమేరాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తాలూకా ఎస్సై మన్నం మురళి,ఎక్సైజ్ సిఐ సిహెచ్ వెంకటేశ్వర్లు వివరాలను తెలిపారు.

దేనికోసం వీక్షణం  దేనికోసం ఆరాటం ఈ రోజు నీదనుకునేలొపే..

దేనికోసం వీక్షణం  దేనికోసం ఆరాటం ఈ రోజు నీదనుకునేలొపే  అంతమయ్యెతీరు తెలతెలవారు వేళ బ్రతుకు తెల్లారిపోతు పచ్చపచ్చని లోగిళ్లు మృత్యుఘటికలనే మ్రేగిస్తుా గుబులు దిగులుగా మెులకెత్తి ముంచుకొచ్చె విషాదంలొ మునిగి గాయపడ్డ బ్రతుకులై  పరిమళించాల్సిన బ్రతుకులు పతనమైపోతుా పసిబిడ్డల ప్రాణాలకే కమ్మిన ముప్పై  కన్నులు తెరవని రొదనై వాస్తవంలొ విషవాయువులే చుట్టి కంబళించెనే కనికరమే కరువై కలత చెందిన మనసులు కన్నీరుకార్చే సంఘటనలు కరోనా యుధ్ధంలొ మరిొ అతర్యుద్దమై విషాద వీచికలై మనసు భారమై నిండిన నిర్లక్ష్యం నట్టేట ముంచుతుా తల్లడిల్లి సొమ్మసిల్లి  చిన్నపెద్ద లేదు ముాగజీవుల సహితం మృత్యువాసనలకే బలిచేస్తుా తప్పెవరిదని ప్రశ్నిస్తున్న విగతజీవులై  ఊపిరందని విధివంచితులై పరుగుల జాలంలో చిరునవ్వులు మాయం చేస్తుా ముసురుకున్న చీకట్లో  గడప గడపలొ సొలివాలి  నిరంతర కష్టాలు గాంచుతుా శోకిస్తున్నాయి మనసులు  కరొనా యుద్దమైనా విషవాయువు పోరులొనైనా మృత్యువుతొ పొరాడి గెలవాలని నిశ్శబ్దమైనా వాకిళ్లు తిరిగి వెలగాలని నీరొడుతున్నాయి అక్షరాలు  పదపదములొ మదిబాధనేదో నింపేస్తుా మరో శుభోదయ ఉదయానికై ఎద...

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు

రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సుబ్బారావు గారికి రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు.               talentexpress.page

బంధాలు సాక్షిగా..

ప్రపంచ  రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రపంచ  రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు. కె. యస్. లక్ష్మణరావు , శాసనమండలి సభ్యులు.