దైవాలు

దైవాలు 🙏


దయచుాపని బ్రతుకునీకేలా
జాలిగాచుాడని చుాపునీకేలా
ఓదార్పుమాటలేని నోరునీకేలా
స్పందించలేని గుండె నీకేలా
తల్లిదండ్రులగాంచని జీవితమేలా
పిడికెడన్నం పెట్టని చేతులేలా
మంచివైపు సాగని కాళ్లేలా
కనిపించని దైవంకోసం వెతుకులాటేలా
ధనమెంతైనా దైవానికేలా
మనసుపెట్టిగాంచవా మమతనంతా చుాడవా
అమ్మనుమించిన దైవం కలదా?
నాన్ననుమించిన త్యాగం కలదా?
సత్యమెరిగి నడచుకో
నిజదైవాలను కొలుచుకో
కష్టమంతా గాంచరా
కన్నీటి విలువ చుాడరా
కలియుగ కాలాన పుణ్యమంతా నీదిరా..


   - అరుణ సందడి✍