మేమంతా నటులం-మాదంతా నటకులం

https://youtu.be/xcGF_V5XkOEమేమంతా నటులం-మాదంతా నటకులం
-----------------------------------------------------
                     -డా.వెంకట్ గోవాడ


మేమంతా నటులం
మాదంతా నటకులం
నాటకం అయినా,
రేడియో అయినా,
టీవీ అయినా, 
సినిమా అయినా, 
షార్ట్ ఫిలిం అయినా, 
వెబ్ సిరీస్ అయినా,
ఏ ప్రదర్శన అయినా, 
ఏ ప్రదేశమైనా,
ఏ కళయినా ఏ రూపమైనా,
మాదంతా ఒకటే గళం-
మేమంతా కళాకారులం. 
అందరిలాంటి మనుషులం 
కానీ మాలో మానవత్వం ఎక్కువ అందరిలాంటి మనుషులం 
కానీ మాలో దయాగుణం ఎక్కువ అందరిలాంటి మనుషులం 
కానీ మాలో మంచితనం ఎక్కువ 
అందరిలాంటి మనుషులం 
కానీ మాలో చైతన్యస్ఫూర్తి ఎక్కువ
అందరిలాంటి మనుషులమే 
కానీ మాలో సామాజిక బాధ్యత ఎక్కువ అందుకే 
గుండెల్లో నీళ్లున్నా 
కళ్ళల్లో ఆనందం కురిపస్తాం
మనసుల్లో వేదనున్నా 
రూపంలో ఆహ్లాదం జొప్పిస్తాం 
శ్వాసల్లో వేడి కమ్మినా 
ప్రదర్శనల్లో హాస్యాన్నే గుప్పిస్తాం
ఎందుకంటే
మేమంతా నటులం 
మాదంతా నటకులం.
కరోనా కట్టడితో 
చేతులు కట్టుకు కూర్చోం 
భౌతిక దూరంతో 
సంఘాన్నే ఉద్దరిస్తాం 
ప్రాపంచిక మార్గంలో 
మానవాళితో పరిగెడతాం 
కొత్తదనపు ప్రదర్శనల్తో 
వినోదాన్నే పంచేస్తాం 
నట జీవన ప్రయాణంలో 
నిర్విరామంగా పయనిస్తాం 
మాకు నాటకాలు లేవు 
మాకు సీరియల్స్ లేవు 
మాకు సినిమాలు లేవు 
మాకూ కష్టాలు ఉన్నాయి 
కానీ కలిసి పోరాడుతాం-
స్వీయ నియంత్రణే యుద్ధంగా,
పరిశుభ్రతే ఆయుధంగా.
మీరుంటే మా వెంట 
అతి త్వరలో 
మా ప్రదర్శనలతో 
మేముంటాం మీవెంట 
మేమంతా నటులం
మాదంతా నటకులం.