రేషన్‌ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
బియ్యం నాణ్యత, పంపిణీలో పారదర్శకత, అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది.


మొబైల్‌ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేయనున్నారు. 
ఇందుకోసం అత్యంత నాణ్యతతో కూడిన కాలుష్యరహిత సంచులను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
రెండు లేదా మూడు నిత్యావసర సరుకులతో పాటు బియ్యం డోర్‌డెలివరీకి పౌరసరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది.👍👍