తక్కువ ధరలో అద్భుతమైన రోగనిరోధక శక్తి నిచ్చే పండు బొప్పాయి

*అతి తక్కువ ధరలో అద్భుతమైన రోగనిరోధక శక్తి లభించే పండు ఈ బొప్పాయి పండు.*


*1 ) బొప్పాయి లోని A,C మరియు K విటమిన్లు ఇమ్యునో బూస్టర్లు గా పని చేస్తాయి.*


*2 ) శరీరంలోని కనజాల వృద్ధికి మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.*


*3 ) ఇందులో నీరు మరియు పీచు తగిన ప్రమాణంలో ఉంటాయి.*


*4 ) ఫోలిక్ ఆమ్లం, ఫోటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు జింక్ అదనపు శక్తిని ఇస్తాయి.*


*5 ) 100గ్రాముల బొప్పాయి లో 40 కెలోరీలు లభిస్తాయి.*


*6 ) రోజులో మనకు అవసరం అయ్యే విటమిన్ A లో  20 శాతం మరియు విటమిన్ C లో 70 శాతం ఈ బొప్పాయి ద్వారా లభిస్తుంది.*


7 ) *తక్కువ కెలోరీలు మరియు ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు దీనిని తీసుకోవచ్చు.*


*8 )100గ్రాముల బొప్పాయిలో కేవలం చక్కెర కేవలం ఎనిమిది గ్రాములే ఉంటుంది.*


*9 ) కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు మరియు వృధ్యాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.*


*10 ) బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.*


*11 ) తరచూ ఒక గ్లాస్ బొప్పాయి రసం తీసుకుంటే మలబద్దకం ఉండదు.*


*12 )ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రీయంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.*


*ప్రతిరోజు కనీసం 100గ్రాముల బొప్పాయి తీసుకోండి.*


*సేకరణ : డా.నయీమ్ ఖాన్*