Skip to main content

ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం


కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల అవసరార్థం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన విధి విధానాలు.


*ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించుటకు గాను   రిజర్వేషన్ కు  సంబంధించిన వివరాలు*


ఈ ప్రత్యేక రైళ్లు లో  కేవలం  రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.
ప్రత్యేక రైలు బయలు దేరే స్థానం నుండి  గమ్య స్థానం చేరే  ప్రయాణ మార్గమధ్యంలో ఎదురయ్యే స్టేషన్లలో మాత్రమే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు తెరవబడతాయి మరియు ఆ కౌంటర్ల వద్ద  ఈ కింద ఉదహరించిన వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.
ఉన్నతాధికారులచే అభ్యర్ధన అనుమతి పొందిన  అత్యవసర నిమిత్తం ప్రయాణించే HOR ప్రయాణికులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, గౌరవనీయమైన సుప్రీంకోర్టు మరియు వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు మరియు సంబంధించిన జాబితా లో గల వ్యక్తులు.
ప్రస్తుత మరియు మాజీ MP లు, MLA లు మరియు  MLC లు.
స్వాతంత్ర్య సమరయోధులు
ఛార్జీలు ముందుగానే చెల్లించబడే  లేదా తరువాత తిరిగి పూర్తిగా చెల్లించబడే  వారెంట్లు మరియు  ఓచర్లు
సంబంధిత  పత్రాలు సమర్పించడం ద్వారా చార్జీలో  మినహాయింపు కోరే ప్రయాణికులు.


రైల్వే సిబ్బందికి సంబంధించిన ఉచిత ప్రయాణ టికెట్లు, సామాన్య మరియు డ్యూటీ పాస్ లకు సంబంధించి టికెట్లు.


జనరల్ కోటా కు సంబంధించి రిజర్వేషన్ కేవలం IRCTC వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే రిజర్వేషన్ చేసుకోవలసి ఉంటుంది.


ఈ ప్రత్యేక రైళ్ల యందు టికెట్ రిజర్వేషన్ అనేది రెగ్యులర్ గా నడిచే రైళ్ల కు ఉన్న నియమ నిబంధనలతో పాటు  క్రింద పేర్కొనినవి  తప్ప  మరి ఏ ఇతర  రిజర్వేషన్ కోటా లు  ఈ ప్రత్యేక రైళ్లలో అనుమతించబడవు.


రైల్వే నిబంధనలు అనుసరించి 3AC కోచ్  నందు 2 బెర్తులను దివ్యాంగులకు కేటాయించడం జరుగుతుంది.


ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ సూచించిన సూచనలకు అనుగుణంగా రైలు తో పాటు ప్రయాణించి విధులు నిర్వహించే సిబ్బంది వసతికి అనుగుణంగా బెర్తుల కోటా రిజర్వు చేయబడతాయి.


అత్యున్నత అధికారులచే రికమెండ్ చేయబడిన అత్యవసర ప్రయాణికులు, ప్రస్తుత మరియు మాజీ పార్లమెంట్ సభ్యులకు సంబంధించి 1AC నందు  2 బెర్తులు మరియు 2AC నందు 4 బెర్తులు  రిజర్వేషన్ కోట కేటాయిస్తారు.


విధులకు హాజరు కాబోయే రైల్వే సిబ్బందికి సంబంధించి డ్యూటి పాస్ కోట కింద  1AC లో 2 బెర్తులు, 2AC లో 4 బెర్తులు మరియు 3AC లో 12 బెర్తులు  రిజర్వేషన్ కల్పిస్తారు.


రైలు బయలుదేరు సమయానికి ముందు   రిజర్వేషన్ చార్టులను తయారుచేసే సమయంలో సంబంధిత కోటాలలో మిగిలిపోయిన బెర్తులను  అవసరపడిన తదుపరి రిమోట్ స్టేషన్ కు  బదిలీ చేయబడతాయి.


ఈ రైళ్లు పూర్తిగా టికెట్ రిజర్వ్ చేయబడిన వ్యక్తులతో ప్రయాణించే రైళ్లు కాబట్టి టికెట్ తనిఖీ చేయు సిబ్బంది సంఖ్యను సమీక్షించి తక్కువ మందికి విధులు కేటాయిస్తారు మరియు విధులు నిర్వహించే సిబ్బందికి సురక్షిత చర్యలలో భాగం గా మాస్క్ లను హాండ్ శానిటైజర్లను అందచేస్తారు.


*నిర్దేశించ బడ్డ  ప్రామాణిక సురక్షిత పద్దతుల ద్వారా ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వ్యక్తులను  సురక్షితముగా    తరలించడం.*


ఎప్పటికప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కేంద్ర హోమ్ శాఖలతో  సంప్రదింపులు జరుపుతూ వారు సూచించే  సలహాలు సూచనలు  అనుసరించి  కేంద్ర రైల్వే శాఖ ద్వారా ఈ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.


రైలు బయలుదేరు మరియు గమ్య స్థానం కి సంబంధించిన సమయాలు, టికెట్లు బుక్ చేయు విధానాలు, ప్రయాణికులు  రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించడం   స్టేషన్ లో కదలికలు, కోచ్ లో లభించే సేవలు గురించి రైల్వే శాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడం.


సరైన ప్రయాణ టికెట్లు తో  ప్రయాణించే వ్యక్తులను మాత్రమే స్టేషన్ లోకి అనుమతించడం జరుగుతుంది.


ప్రయాణించే వ్యక్తికి  సంబంధించి  రైల్వే స్టేషన్  వరకూ రాకపోకల రవాణాకు గాను  ఉపయోగించే వాహనాన్ని అనుమతించుటకు గాను  నిర్ధారించబడిన e-ticket ఉంటేనే అనుమతి ఇస్తారు. 


కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైలు నడుపు స్టేషన్ లో ఈ కింది చర్యలు చేపడుతుంది.


ఈ ప్రత్యేక రైలు లో ప్రయాణించే ప్రతి వ్యక్తులను రోగ లక్షణాలు కొరకు స్క్రీనింగ్ చేయబడతారు.


ఎటువంటి రోగలక్షణాలు లేని  వ్యక్తులను మాత్రమే ప్రయాణించే రైలు లోకి అనుమతించబడతారు.


ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి స్టేషన్ ప్రవేశ ద్వారం మరియు నిర్గమ ద్వారం వద్దే కాకుండా కోచ్ ప్రవేశ ద్వారం మరియు నిర్గమ  ద్వారం వద్ద హాండ్ శానిటైజర్లను సమకూర్చడం జరుగుతుంది.  


ప్రయాణికులందరూ స్టేషన్ లోకి ప్రవేశించూ మొదలు     ప్రయాణ పూర్తి అయ్యే వరకూ ముఖానికి సరైన మాస్కు ధరించాలి.


ప్రయాణ సమయం లో ప్రయాణికులందరూ తమ తోటి ప్రయాణికుల  మధ్య సరైన దూరం ఉండేలా పాటించాలి.


ఆరోగ్య సలహాలు సూచనల సమాచారం సిబ్బందికి మరియు ప్రయాణికులకు తగిన విధంగా చేరేలా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలి.


ప్రయాణికులు గమ్య స్థానం చేరాక సంబంధిత రాష్ట్రం సూచించిన ఆరోగ్య సూత్రాలను తప్పక  పాటించాలి.


మొదటి రైలు బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరి ఉదయం అర్ధరాత్రి తరువాత అనంతపురం 130 నిమిషాలకు గుంతకల్ స్టేషన్లలో ఆగి సికింద్రాబాదు మీదుగా ఢిల్లీకి బయలుదేరడం జరిగింది.. అందులో అనంతపురం కు 42 మంది గుంతకల్ కు 15 మంది దిగడం జరిగింది. 


తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైలు ప్రయాణం సుఖమయం చేసుకోవాలని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు
___________________________
 *డాక్టర్ అర్జా శ్రీకాంత్ 
స్టేట్ నోడల్ ఆఫీసర్ Covid 19*.                         -


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...