కనిపించే దేవుని రూపాలు నర్సులు

కనిపించే దేవుని రూపాలు నర్సులు  
*************************
ఊపిరాడని పిపిఇ సూట్లు 
వైద్యానికి సహకరించని రోగులు 
కుటుంబానికి దూరంగా నివాసాలు 
ఐసోలేషన్ వార్డులో నిరంతర సేవలు 


బెడ్ వదిలేసి బయటకు వచ్చే రోగులు 
చాలా దగ్గరగా వచ్ఛి మాట్లాడే రోగులు 
చీటికి మాటికీ చీకాకు పడే రోగులు 
వింత వింత ప్రవర్తనలు చేసే రోగులు 


నెలలో ఇరవై రోజులు డ్యూటీ 
నిరంతర విధులతో విరామంలేని డ్యూటీ 
ఆస్పత్రి సమీప హోటలు నుండి వచ్ఛి చేయవలసిన డ్యూటీ 
క్షణక్షణం కరోనా భయంతో చేసే డ్యూటీ 


అయినా చిరునవ్వులతో రోగులకు సేవలు 
ప్రతిక్షణం అప్రమత్తతతో చేయవలసిన విధులు 
ఓర్పుతో అందించవలసిన కరోనా సేవలు 
కనుకనే కనిపించే దేవుని రూపాలు నర్సులు 


అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి హృదయ పూర్వక అక్షర శుభాకాంక్షలు 


- డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, సెల్: 9347537635