తాపీ ధర్మారావు విశేషాలు

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🔷క🔷ళా🔷దీ🔷పి🔷<క>🔷ళా🔷దీ🔷పి🔷క
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●


కళాదీపిక-సాహిత్య దీపిక
●●●●●●●●●●●●●


'ఆంధ్ర విశారద'
తాపీ ధర్మారావు
19-9-1887 ◆ 8-5-1973
(ఈరోజు వారి వర్థంతి)
●●●●క●ళా●దీ●పి●క●●●●
తాపీ ధర్మారావు 
1887 సంవత్సరంలో 
సెప్టెంబర్ 19న 
ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న 
బెర్హంపూరు (బరంపురం ) లోని 
ఒక తెలుగు కుటుంబములో 
జన్మించారు. 


ధర్మారావు 
తల్లి పేరు నరసమ్మ. 
తండ్రి అప్పన్న. 


వీరి ఇంటి పేరు మొదట్లో 
'బండి'లేదా 'బండారు' 
కావచ్చును. 


అప్పన్న తాత 
లక్ష్మయ్య 
కొంతకాలం 
మిలిటరీలో పనిచేశారు. 
తరువాత 
తాపీ పనిలో 
మంచి పేరు తెచ్చుకొన్నారు. 


అలా అతనికి 
శ్రీకాకుళంలో 
'తాపీ లక్ష్మయ్యగారు' అన్న పేరు 
స్థిరపడిపోయిందట.
అదే 
వీరి ఇంటిపేరుగా మారిందట.


ధర్మారావు
ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, 
మెట్రిక్యులేషన్ విజయవాడలో, 
పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు 
చదువుకొని, 
మద్రాసులోని 
పచ్చయప్ప కళాశాలలో చేరారు. 


పర్లాకిమిడిలో చదివే రోజులలో 
వ్యవహారిక భాషావేత్త అయిన 
గిడుగు రామ్మూర్తి ఈయనకు 
గురువు కావటం విశేషం.


కల్లికోట రాజావారి కళాశాలలో 
గణిత ఉపాధ్యాయులుగా 
పనిచేశారు. 


తాపీ ధర్మారావు 
చరిత్ర, గణితం, తెలుగు, ఇంగ్లీషు, 
చక్కగా తెలిసిన పండితులు. 
సామాజిక శాస్త్రాలను 
తొలిసారిగా జనరంజకంగా 
తెలుగులో వ్యక్తీకరించిన 
ప్రతిభాశాలి ఆయన. 


1910 ప్రాంతంలో 
కొందరు మిత్రులతో కలిసి 
బరంపురంలో 
వేగుచుక్క గ్రంథమాలను 
స్థాపించారు. 


ఇతని తొలి రచన 
1911లో 
'ఆంధ్రులకొక మనవి' 
అనే పేరుతో వెలువడింది. 


ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో 
బొబ్బిలి రాజా వారు 
ముఖ్యమంత్రి స్థానంలో 
ఉన్నప్పుడు
ధర్మారావు  ఆయన దగ్గర 
కార్యదర్శిగా పనిచేశారు.


తొలుత 
గ్రాంథిక భాషా వ్యామోహంతో 
వాడుక భాషను 
తక్కువ చేసి మాట్లాడినా, 
తర్వాత విలువ తెలిసి 
ప్రజల భాషను 
గౌరవించడమే కాదు- 
తిరిగి ఆ ప్రజలకే 
గొప్పగా అందించిన 
రచయిత, సంపాదకుడాయన. 


వ్యవహారిక భాషలోకి 
మళ్లిన తర్వాత 
1936లో 'జనవాణి' పత్రికలో 
ఆ భాషనే ప్రవేశపెట్టి, 
విజయం సాధించారు. 


అక్కడ ఆయన వద్ద పనిచేసిన 
సహ సంపాదకులు 
నార్ల వెంకటేశ్వరరావు, 
పండితారాధ్యుల నాగేశ్వరరావు, 
పి.శ్రీరాములు వంటి వారు 
తర్వాతి కాలంలో సంపాదకులై, 
చరిత్ర సృష్టించారు. 


''పత్రికలు వట్టిమాటల పోగులే కాదు,
సంఘంలో ఒక కొత్త జీవకళను 
కలిగించడంలో చేతనైన విధంగా 
పత్రికా ముఖంగా సాయపడాల''ని 
'కాగడా' వారపత్రికలో 
చాలా స్పష్టంగా 
తాపీవారు పేర్కొంటారు. 


'దేవాలయాలపై 
బూతుబొమ్మలు ఎందుకని?' 
1936లో వారి మిత్రులు 
గూడవల్లి రామబ్రహ్మం 
నిర్వహించిన 
'ప్రజామిత్ర'లో 
ధర్మారావు 
వ్యాసాలు ప్రచురించి 
సామాజికశాస్త్ర విషయాలను 
తొలుత రాసిన వ్యక్తి అయ్యారు. 


పత్రికా నిర్వహణలో 
వీరి నేర్పు 
అనన్య సామాన్యమైనది.


సమదర్శిని, జనవాణి, కాగడా 
పత్రికల ద్వారా వారు చేసిన 
పత్రికా సేవ విలక్షణమైంది. 


ఇంటింటి విజ్ఞానమాల, 
తాతాజీ రచనల ప్రచురణ సంస్థ, 
తాపీవారి ప్రచురణలు  
ఇలా 
విభిన్న ప్రచురణ సంస్థలు స్థాపించి, 
పుస్తక ప్రచురణ చేశారు. 


ఒకవైపు పత్రికారంగంలో,
మరొక వైపు రచనారంగంలో, 
అర్థవంతమైన విజయాలు సాధిస్తూనే 
1937లో 
తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. 


గూడవల్లి రామబ్రహ్మం 
తోడ్పాటుతో 
'మోహినీ రుక్మాంగద' చిత్రానికి 
తొలి సినీ రచన చేశారు. 


చిత్రానువాదం ప్రక్రియకు 
సంబంధించి 
ప్రత్యేక కృషి చేశారు. 


అప్పట్లో సినిమా రచనకు 
సంబంధించి 
తాపీ స్కూల్‌, 
సముద్రాల స్కూల్‌ అని 
రెండు సమాంతరంగా నడిచాయట. 


1963లో చేసిన 
చివరి చిత్రం 'భీష్మ' దాకా 
తాపీ వారి ప్రతి చిత్రం 
విజయవంతమయ్యాయి. 


సంభాషణలు, పాటలు, 
చిత్రానువాదం మాత్రమే కాకుండా 
తెలుగు ఫిలిం జర్నలిజానికి 
సంబంధించి 
విశేష కృషిచేసిన వ్యక్తి 
తాపీ ధర్మారావు.


ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ వంటి
50 సినిమాలకు(దాదాపుగా) 
సంభాషణలు రాశారు. 


'మాలపిల్ల' 
(1938) సినిమాకు 
కథ అందించినది 
గుడిపాటి వెంకటచలం.


తెలుగు సినిమా దర్శకులు
తాపీ చాణక్య 
ఇతని కుమారుడు.


తాపీని గౌరవంగా 
'తాతాజీ' అని పిలిచేవారు.


శృంగేరి పీఠాధిపతులు 
జగద్గురు 
చంద్రశేఖర భారతీ  
శంకరాచార్యుల వారి నుండి 
1926లో 
‘ఆంధ్రవిశారద’ 
బిరుదును పొందారు.


చేమకూరి వెంకటకవి రచించిన
'విజయవిలాసం’ కావ్యానికి చేసిన
‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 
1971లో 
కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.


ఇలా...మరెన్నో 
పురస్కారములు
అందుకొన్న ధర్మారావు,
1973 మే 8 వ తేదీన 
అస్తమించారు.


●●●●●


★సంకలన వ్యాసం:వ్యాస కర్తలకు ప్రణామములతో...


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏క🙏ళా🙏దీ🙏పి🙏<క>🙏ళా🙏దీ🙏పి🙏క🙏
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● - కళాదీపీక సౌజన్యం