కుమార్ పంపులు సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కు నిత్యావసర వస్తువుల పంపిణీ తెనాలి పట్టణం లో పనిచేస్తున్న పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పారిశ్రామికవేత్త, కుమార్ మంపులు సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సోమవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక కుమార్ పంపులు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న పాత్రికేయులసేవలు మరువరానివని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త,కుమార్ పంప్స్ అధినేత కొత్తా సుబ్రహ్మణ్యం అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ప్రముఖమై నదన్నారు. నిరంతరం ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ,వాటి పరిష్కారానికి కృషి చేసే పనిలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. తన వంతు సహాయంగా కార్యక్రమమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి. రవింధ్రబాబు మాట్లాడుతూ తొలి నుంచి కష్టపడి పైకి వచ్చి పారిశ్రామికవేత్తగా తన ప్రతిభను,నలుదిశలో విస్తరింపజేసారన్నారు. కొత్త సుబ్రహ్మణ్యం విలేకరుల పట్ల సానుభూతితో సహాయ సహకారం అందించటం ముదావహమన్నారు. కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ,చిన్న పత్రికల విలేకరులు అసాధారణ రీతిలో సమాచారం సేకరించి వెలుగులోకి తెస్తున్నారని, అలాంటి వారికి ప్రకటనలు ఇచ్చే క్రమంలో, ప్రాధాన్యత కల్పించాలని కోరారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ నాయకులు జి.ప్రభాకర్ మాట్లాడుతూ,సుబ్రహ్మణ్యం తొలి నుంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని అలాంటి వ్యక్తి మన తెనాలి పట్టణంలో ఉండటం గర్వకారణమన్నారు. నేడువిలేకరులకు తన సహాయ సహకారాలు అందించటం అభినందనీయమన్నారు. వందమందికి పైగా విలేకర్ల కు సంస్థ ప్రతినిధులు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు గుమ్మడి ప్రకాశరావు, బొల్లిముంత కృష్ణ ,ప్రకాష్ రావు, లక్ష్మణరావు, నాయుడు, చందు, ప్రేమ్ కుమార్, మేకల సుబ్బారావు, సామ్యేల్, జహీర్, యం.రవి, శేఖర్, జానీ, గుంటూరు విజయ్, రెడ్డి, యడవూరు సాంబశివరావు, రమేష్, శ్రీకాంత్, శ్రీను, నాగరాజు, శ్యామ్ సాగర్, రామారావు, బదరి ప్రసాద్, వి. భాస్కర్, జీవన్ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్’’ సినిమా యూనిట్ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’ సినిమాను నిర్మించారు. సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....