రవీంద్ర భారతి విశేషాలు

ఈ రోజు రవీంద్రభారతిని ప్రారంభోత్సవం చేసిన రోజు. రవీంద్రభారతిన 23/03/1960 న అప్పటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్, మాజీ ముఖ్య మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. మొహమ్మద్ ప్యాయజుద్దీన్ బిల్డింగ్ ని డిసైన్ చేశారు. ప్యాయజుద్దీన్ లండన్ లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో పట్టభద్రుడు. ఈ భవనాన్ని రవీంద్రనాథ్ టాగోర్ గారి జన్మదిన శతకము సమయములో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిర్మించింది.  రవీంద్రభారతి ని మే 11,1961 న మాజీ ప్రధాన మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు.


  ఈ ఆడిటోరియంను 2005 నందు, దాదాపు 44 సంవత్సరాల తరువాత రెనోవేషన్ చేయడం జరిగింది.  రెనోవేషన్ భాగంగా అంతరభాగం లోని గదిని అలంకరించడం, కొత్త లైటింగ్, సౌండ్, ఎయిర్ కండిషన్, స్టేజ్, గ్రీన్ రూమ్ మరియు సీట్లు ఆధునిక  హంగులతో నిర్మించడం జరిగింది. వీటితో పాటు పార్కింగ్ స్థలం, ఆహార శాల మరియు లాండ్స్కేప్ ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రెనోవేషన్ సమయంలో, దాదాపు ఒక నెల రోజులు, ఆడిటోరియం నందు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. దేశ ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటకు ఈ భవనాన్ని ఉపయోగించాలని ఈ భవన నిర్మాణ ప్రధాన ఉద్దేశం.  


రవీంద్రభారతి భవనం లో మూడు ముఖ్య అంతస్తులు, ఒక ప్రధాన గది ఉంది. ఈ ప్రధాన గది లో వెయ్యి మంది పేక్షకులు వీక్షించుటకు వీలుంటుంది.  


2016 నందు 125 రోజుల నిడివితో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా, బుర్రకథ, హరికథ, ఒగ్గుకథ, సురభి నాటకాలు, గిరిజన నృత్యాలు, ఎక్స్పెరిమెంటల్ నాటకాలు, యువ నాటకాలు మొదలైనవి  ప్రదేశించడం జరిగింది.