Skip to main content

ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనది

ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనది..                                      -హోమ్ మంత్రి సుచరిత


విశాఖపట్నం ఎల్.జి.పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమైనదని, ప్రతి ఒక్కరిని ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హోమ్ మంత్రి సుచరిత అన్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు యావత్ భారతదేశానికి ఆదర్శనీయమైనది చెప్పారు. అంతే కాకుండా విశాఖ ప్రజలు, యువత, పోలీస్ యంత్రాంగం, అధికారులు సకాలంలో స్పందించడం వలన దుర్ఘటనలో ఎక్కువమంది ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగారన్నారు. కరోనా బాధ్యతల్లో పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నప్పటికి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తీరు ప్రసంశనీయం అన్నారు.  ముఖ్యమంత్రి  ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారన్నారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ప్రకటించిన దాఖలాలు లేవు. అదేవిధంగా తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, అస్వస్థతకు లోనైన వారికి లక్ష రూపాయలు, ఐదు గ్రామాలకు చెందిన దాదాపు 15 వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయమందించడం నభూతోనభవిష్యత్తు అని చెప్పవచ్చునన్నారు.  ముఖ్యమంత్రి  భాదితులకు ఒక్క రోజులోనే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సామాన్యమైన విషయం కాదు. గతంలో భాదితులకు నష్టపరిహారం ఎక్కువగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేసేవి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారంపై విపక్షాలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పారు. గతంలో ప్రమాదలు జరిగినప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరును నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరును ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలపై సమీక్షలు పెట్టి నష్టపరిహారం ప్రకటించిన ఎప్పటికో భాదితులకు నగదు చేరేది. నేటి ప్రభత్వం ఒక్క రోజులోనే భాదితులకు తక్షణ సహాయం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దుర్ఘటనలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయో మనం ఊహించలేము. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించిన తీరును ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు పోలీసులు, స్థానిక ప్రజలు, యువత, అధికారులు కనబరిచిన తీరును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. ప్రమాదం లో గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్నప్పటికి..ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా  ప్రభుత్వమే చేసుకుంటోంది. ఈ సంఘటలో 443 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలను ప్రభ్యుత్వమే అండగా ఉంది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి హై పవర్ కమిటీ ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. ఇప్పటికే ఎల్.జి.పాలిమర్స్ కంపెనీ పై కేస్ కూడా నమోదయ్యింది. ప్రమాదానికి కారణమైన వారిని ప్రభత్వం తప్పక శిక్షిస్తుంది. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు పరిశ్రమలు మూతపడటం వలన ఇటువంటి సంఘటలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటలు జరిగాయి. తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కూడా ప్రమాదాలు జరిగాయి. లాక్ డౌన్ తరవాత ఎవరైనా కంపనీ లను తిరిగి ప్రారంభిస్తున్నప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని హెచ్చరించారు. హైపర్ కమిటీ దర్యప్తు పూర్తియైన వెంటనే ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామన్నారు.


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...