దేనికోసం వీక్షణం  దేనికోసం ఆరాటం ఈ రోజు నీదనుకునేలొపే..

దేనికోసం వీక్షణం 
దేనికోసం ఆరాటం
ఈ రోజు నీదనుకునేలొపే 
అంతమయ్యెతీరు
తెలతెలవారు వేళ
బ్రతుకు తెల్లారిపోతు
పచ్చపచ్చని లోగిళ్లు
మృత్యుఘటికలనే మ్రేగిస్తుా
గుబులు దిగులుగా మెులకెత్తి
ముంచుకొచ్చె విషాదంలొ మునిగి
గాయపడ్డ బ్రతుకులై 
పరిమళించాల్సిన బ్రతుకులు
పతనమైపోతుా
పసిబిడ్డల ప్రాణాలకే కమ్మిన ముప్పై 
కన్నులు తెరవని రొదనై
వాస్తవంలొ విషవాయువులే చుట్టి
కంబళించెనే కనికరమే కరువై
కలత చెందిన మనసులు
కన్నీరుకార్చే సంఘటనలు
కరోనా యుధ్ధంలొ మరిొ అతర్యుద్దమై
విషాద వీచికలై మనసు భారమై
నిండిన నిర్లక్ష్యం నట్టేట ముంచుతుా
తల్లడిల్లి సొమ్మసిల్లి 
చిన్నపెద్ద లేదు ముాగజీవుల సహితం
మృత్యువాసనలకే బలిచేస్తుా
తప్పెవరిదని ప్రశ్నిస్తున్న విగతజీవులై
 ఊపిరందని విధివంచితులై
పరుగుల జాలంలో చిరునవ్వులు మాయం చేస్తుా
ముసురుకున్న చీకట్లో 
గడప గడపలొ సొలివాలి
 నిరంతర కష్టాలు గాంచుతుా
శోకిస్తున్నాయి మనసులు 
కరొనా యుద్దమైనా విషవాయువు పోరులొనైనా
మృత్యువుతొ పొరాడి గెలవాలని
నిశ్శబ్దమైనా వాకిళ్లు తిరిగి వెలగాలని
నీరొడుతున్నాయి అక్షరాలు 
పదపదములొ మదిబాధనేదో నింపేస్తుా
మరో శుభోదయ ఉదయానికై ఎదురుచుాస్తుా
నిశిరాతిరికి మౌనాన్ని ఇచ్చేస్తుా ప్రార్ధిస్తుా🙏


                        అరుణ సందడి✍


విశాఖ లొ జరిగిన గ్యాస్ లీక్ నేపధ్యంలొ వ్రాసిన కవిత!