బరువు
అమ్మ మాట బరువు
అమ్మ బాట బరువు
అమ్మ కడుపు నింపుట బరువు
అమ్మ కష్టంలో సహయం బరువు
అమ్మను గాంచలేని వెదవలందరికీ
అమ్మ బరువు....
పేరుకు గృహ రాణి
గుండెనిండా గునపాల వాణి
కంటికి నిద్ర కరువైన కష్టజీవి
మెుగుడి మురిపాల్లో మౌన రాగిణి
బిడ్డల లాలి పాటలకు వెన్నెల వాహిణి......
పలుకు పలుకులో
పరుగుల రాణి
దుారమైనా భారమైనా
ఇంటికి దీపం తానైనా
బాధ్యతల వర్షం పతిదైనా
సతిగా చక్కబెట్టు సామ్రాజ్యం తనదైనా...
కిరీటాలు నెత్తినెట్టలేదే
కీర్తి కిరీటాలు తానాసించలేదే
ప్రతిఫలమాసించని పడతి తానై
కదలి పోతుంది
బ్రతుకు బాటలో
వడలి పోతుంది...
బంధాలను భుజాల మెాస్తుా
బాధ్యతలతో అడుగులే వేస్తుా
కనికరించే మనసు తానై,
అమ్మ ప్రేమ పంచగా....
కన్న కడుపు నింప ముద్ద పెట్టలేని
ముదనష్టపు బిడ్డలేలా
భుామికి బరువేల
వారికి విలువేల.......
-అరుణ సందడి✍