వలస జీవుల వెతలు

//వలస జీవుల వెతలు//


 పొట్టసేతా బట్టిమేము వలసబోయాం మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.  


సిన్న బతుకు సిద్రమైయ్యి సితికినోల్లం మీ ఆశలసౌదాల్ గట్టేటందూకొచ్చీనోల్లం    


పూట పూటా కూలిచేసి గడపేటోల్లం ఆపదోత్తే ఒకరికొకరం లేకాపోయాం  


అంటకుంటా ముట్టకుంటా ఉండమంటే ఉండాలనే ఉందిగానీ ఏటీసెయ్యం


 కంటినిండా కన్నపేగూ కదులుతోందీ గుండెనిండా అయినవాల్లు కురుత్తుంటే (గురుతొత్తుఉంటే)  


ఆపేదెట్టా.. ఆగేదెట్టా  పోనీండయ్యో  మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో.  


కంచెలన్నీ హద్దులన్నీ దాటేదెట్టా అమ్మనానల్నీ ఆలిబిడ్డల్ని జూసేదెట్టా


  రాదారి మొత్తం రహస్సంగా  దాటాలనీ అడుగు అడుగూ భారంగా నేనేత్తూబోతే


  సరద్దులన్నీ నేరత్తులంటూ ఆపేత్తుంటే అంటురోగులని వల్లుమొత్తం తడిపేత్తుఉంటే


 ఏటిసెయ్యం ఏమిసెయ్యం ఎట్టాగయ్యో.. మొతుకుకోసం మా బతుకుకోసం  వచ్చామయ్యో


 పేదరికమే పెద్ద పాపమని అంటారంతా లేమితనమే పెద్ద జబ్బని తెలీద ఏమీ..


అయినవాల్లతో పండగసేసే యావాలేదు  ఉన్నసోటే ఉన్నదాంతో సర్దుకుంటాం


 కలోగంజో తాగిమేవూ గడుపూతాము ఏమి నేరం సేస్తిమయ్యా వలసగాల్లం


  కరోనా కాటు ఎట్టాగుందో ఇన్నాం గానీ  ఆకలివేటు అంతకంటే పెద్దంగుంది


 ఆదరించ లేకపోతో పోనీండయ్యా మా బతుకులెల్ల అనాదలుగా కానీకండీ


 పట్టెడన్నం పెట్టకున్నా పరవాలేదు. గొంతుతడిపే గంగనైనా ఇత్తేచాలు


  ఊరు మమ్ము దాటనిచ్చి గూడు మమ్ము సేరనిత్తే యాదుమరవక మేమూఉంటాం  


గూడు సేరీ గడపదాటం. గూడు సేరీ గడపదాటం