అమర వీరులకు ఘన నివాళి







గుంటూరు జిల్లా తెనాలిలో..నేటికి సరిగ్గా..78 ఏళ్ళ క్రితం..1942 ఆగస్టు 12 వ తారీఖు మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో 7 గురు అమరవీరులు బ్రిటిషర్ల తుపాకీ గుళ్ళకు బలైనరోజు.



 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన 4 వ రోజు..తెనాలిలో బ్రిటిష్ వారిపై ఉద్యమకారులు తీవ్రస్థాయిలో ఎదురుతిరగడంతో...తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు కాల్పులు జరపగా..7 ఉద్యమకారులు మరణించారు.వీరి స్మారక చిహ్నంగా నిర్మించినదే.. తెనాలి ఓవర్ బ్రిడ్జి డౌన్ లో ఉన్న 'అమరవీరుల రణరంగచౌక్'



1942 ఆగస్టు 12 వ తారీఖు తెనాలి పోలీసు కాల్పుల్లో మరణించిన 7 గురు అమరవీరులు..1.జాస్తి అప్పయ్య 2.ప్రయాగ రాఘవయ్య 3.మాజేటి సుబ్బారావు 4.శ్రీగిరి లింగం 5.భాస్కరుని లక్ష్మీ నారాయణ 6.తమ్మినేని సుబ్బారావు 7.గాలి రామకోటయ్య



ఈ ఏడుగురు అమరవీరుల స్మృతి చిహ్నంగా..ఇప్పుడున్న రణరంగ చౌక్ 1959 డిసెంబర్ 20 వ తారీఖు నాటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న శ్రీ కామరాజ్ నాడార్ ప్రారంభించారు. ఈ 7 స్థూపాలను నాటి తెనాలి మున్సిపల్ చైర్మన్ అయిన శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య గారు తయారుచేయించారు.వీటికి శిల్పి చిన్నాల రంగారావు.ఈ రణరంగ చౌక్ ప్రారంభోత్సవానికి నాటి మన ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు.. దామోదరం సంజీవయ్య గారు..కాసు బ్రహ్మానందరెడ్డి గారు హాజరయ్యారు



 తెనాలి ప్రాంతం స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.ఆ సమయంలో 2,228 మంది ఉద్యమకారులు తెనాలి ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి జైలుశిక్ష అనుభవించినట్టు రికార్డుల్లో ఉన్నది



 

ఫోటో..1942 ఆగస్టు 12 వ తారీఖు పోలీసు కాల్పుల్లో మరణించిన 7 గురు అమరవీరుల స్మృతి చిహ్నం 'రణరంగ చౌక్' 

 

 


రచయిత

మేకల మోహనరావు

చైర్మన్ & ప్రొఫెసర్

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరి