రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి సందర్శించారు తెనాలి నియోజకవర్గంలోని బొమ్మ వారి పాలెం వద్ద మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు కూరగాయలు, పసుపు, అరటి, తమలపాకు, వరి పంటలను పరిశీలించారు. బాధిత రైతులను అడిగి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. పంటనష్టం వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లి మండలం చిర్రావూరి గ్రామం, కొల్లూరు మండలం బొమ్మ వాణి పాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం వెల్లటూరు ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాదారు. ఈ పర్యటనలో కలెక్టర్ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్,జాయింట్ కలెక్టర్, దినేష్ కుమార్ ఎమ్మెల్యే మేరగా నాగార్జున, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.