ఎస్.బి.ఐ. అమరావతి సర్కిల్ భారీ విరాళం.. 23 లక్షలతో 27 సీట్ల బస్సు  దేవస్థానానికి అందజేత

విజయవాడ, ఇంద్రకీలాద్రి, అక్టోబరు17ః-



విజయవాడ ఇంద్రకీలాద్రి వై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి అమ్మవారి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం బస్సును అందజేయడంజరిగిందిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ పి. శివకుమార్ తెలిపారు.  


శనివారం శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం చైర్మన్, కార్యనిర్వాహణాధికారికి ఇంద్రకీలాధ్రి పై ఎస్.బి.ఐ.అధికారులు వాహనాన్ని అందించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ 


అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 27 సీట్లు గల మినీ బస్ ను అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.  


ఈ మహత్కార్యంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.  


ఆన్ లైన్ ద్వారా హైదరాబాదు నుండి చీప్ జనరల్ మేనేజరు సంజయసహాయ్  ఈ బస్సును విరాళంగా దేవస్థానానికి అందజేశారు.


 డి.జి.యం వై. సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ 


అమ్మవారి సేవలో భాగస్వామ్యమవ్వడం పట్ల సంతషంగా ఉందన్నారు.  


దేవస్థానం బోర్డు సభ్యులు ఈ అవకాశాన్ని కల్పించినందులకు  ఎస్ బి.ఐ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 


ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్.బి.ఐ. గాంధి నగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు.


దేవస్థానం ఛైర్మన్ పైలా స్వామినాయుడు , కార్యనిర్వాహణాధికారి యం.సురేష్ బాబు దేవస్థానం తరపున ఎస్.బి.ఐ. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  


27 సీట్ల మినీ బస్సు భక్తులకు ఎంతో సహాయంగా నిలుస్తుందన్నారు. 


 మూలధనం నిధి కింద బస్ దేవస్థానం భక్తులకు సేవలందిస్తుందని వారు తెలిపారు. 


అనంతరం  ఇంద్రకీలాంద్రి పై  గాంధినగర్ బ్రాంచ్  రీజనల్ మేనేజర్ 


 పి. శివకుమార్ నేతృత్వంలో జి.యం., డిజియంలు  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వర్ణకవచాలంకృత  కనక దర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శంచుకున్నారు.