// విషాద పర్వం // భరతమాత ఎదురైనా బలికాక తప్పదేమో కనకదుర్గ కనిపించినా కాముకులు వదలరేమో ఆడతనమంటే అనునిత్యం ఆక్రందనమా అమ్మతనమంటే అఘాయిత్యాల సుడిగుండమా! పుణ్యభూమి నాదేశంలో పురుషాహంకారాలు దుర్యోధన దుశ్శాసన కీచకుల పర్వాలు అడుగడుగునా హత్యాచారాలై.. అతివల ఆక్రందనలు క్షణక్షణానికో రణం.. ఆరని జ్వాలాభారతం ప్రార్ధనా గీతాలు, మతగ్రంధాల నీతి బోధలూ భావి భారత ప్రతిజ్ఞలు.. ఏమయ్యాయమ్మా ? రాసిపెట్టిన రాజ్యాంగాలు, చేసిన సవరణలు శాసనసభల చట్టాలు, శాసించే సిద్దాంతాలు నినదించే నిర్భయలు, దిక్కుతోచని దిశలు ఎన్ని విషాదపర్వాలో.. ఎన్నెన్ని నిశీధి గీతాలో అయ్యో.. తల్లీ.. భరతమాతా ఇది విన్నావా? శక్తి ప్రతీక స్త్రీ అనేది ఒట్టి నానుడైయ్యిందమ్మా శక్తి విహీనం చేస్తున్న మృగతత్వపు మనిషి వికృతత్వం మకిలిపడ్డ మనసుల్లో.. కరుడుగట్టిన కఠినత్వంలో.. సిగ్గుదాచే తెరను లాగి గొంతు నొక్కినవైనం నిర్బంధించి వెన్నువిరిచి నాల్క కోసిన దారుణం తొడలమధ్యన "తొక్కిసలాట" కై నరకయాతనన పెట్టిన ఆటవికం ఎందుకమ్మా ఈ వైపరీత్యం.. ఏమిటమ్మా ఈ అరాచకం కలిమిలేముల మధ్య.. బలబలహీనతల చాటున చట్టాలకు చుట్టాలెవరో.. న్యాయదేవతకు చెప్పమ్మా కళ్ళగంతలు తీయమని.. అబద్ధపు పత్రాలను వినకనీ.. అర్ధరాత్రి రహస్యచితిలో బూడిదైన సత్యాన్ని వి(క)నమనీ.. నాలుగ్గోడల మధ్య వెలకిరాని ఉదంతాలెన్నో కరెన్సీ కాగితాలతో నోరునొక్కబడుతుంటే కొవ్వొత్తుల ప్రదర్శనలో.. కాగడా ర్యాలీలో మానవ హక్కుల పోరా పత్రికల్లో సానుభూతి వార్తలో.. మీడియా రేటింగులో.. అచ్చయిన కవితలో.. ఏదీ మార్చలేదా.. మురికి పట్టిన మస్తకాన్ని ? అజ్ఞానం నింపుకున్న మనిషి మనసు మారనిదే విషంచిమ్మి కాటువేసే కేటుగాళ్లపై వేటు పడనిదే మహిళకేది మనశ్శాంతి రగులుతున్న హృదయం అడుగుతుంది నిన్నే.. ఎన్ని మేనులిలా నేలపాలు కావాలని ఏదమ్మా స్త్రీ ఉనికని..
|
విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్’’ సినిమా యూనిట్ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’ సినిమాను నిర్మించారు. సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....