వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాల అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష

వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాల అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌ జగన్‌ సమీక్ష


- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు.


అమరావతి:


సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:


బ్రాండింగ్‌ తీసుకురావాలి:
– వైయస్సార్‌ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం కాబట్టి, ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. 
– ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలి. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
– కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్‌ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలి.
– ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలి.
– వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి, లేకపోతే విశ్వాసం కోల్పోతాము. 
_ లబ్దిదారుడికి ఎట్టి పరిస్ధితుల్లోనూ నష్టం రాకుండా చూడండి 
_ కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్‌ తీసుకురావాలి, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలి.
– స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలి.


నిపుణుల అభిప్రాయం తీసుకోండి:
– వైయస్సార్‌ చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోండి.
– అలా చేస్తే భవిష్యత్తులో ఏ సమస్యా రాదు.
– లబ్ధిదారులు ఏ ఆవు లేదా గేదె కొనవచ్చు అన్నది మాత్రమే సూచించాలి.
వారికే నిర్ణయం వదిలేయాలి.