Skip to main content

Posts

Showing posts from February, 2021

ఆ తర్వాత..!!

 //ఆ తర్వాత..!!//  వాటెడు ఎండు గడ్డి మీద పడుకోబెట్టిన నిర్జీవ దేహం  చుట్టూ కొన్ని సజీవ శరీరాలు మొహాలన్నీ భావాలు దాచేసి బాధని పులుముకుని ఒకే రంగును పండించే రంగస్థలం వీడిన గోడును వెళ్ళబోసుకునే కన్నీరై సానుభూతి పవనాలు.. వెలికిరాని దుఃఖాన్ని మింగేసిన మాటవై ఓ పక్కన విషాదాన్ని ఒలకబోస్తూనే కలబోసుకునే కుశలాల కులాసాలు అణిచిపెట్టుకున్న ఆకలి, తెచ్చిపెట్టుకున్న గంభీరాల నడుమ ఓ కాఫీ కప్పో మజ్జిగ గ్లాసో చాటుగా ఓదార్చుతుంది ఉగ్గబట్టుకున్న ముసలి ప్రాణాన్నీ..  ఏమీ తెలియని పసితనాన్నీ అడ్డుపెట్టుకుని ఎవరో ఒకరు గుప్పెడు ఉప్మా దోసిట్లో వేసి తను వేసిన గుటకని కప్పుకుంటారు కొన్ని పొగడ్తలు మరికొన్ని జాలి మాటలు ఇంకొన్ని సానుభూతి వాక్యాలు వేసిన సాంబ్రాణి దూపంలా చుట్టూ అలుముకుంటాయి. పేడ ముద్దపై పెట్టిన ఒంటొత్తు  దీపపు ప్రమిదపైనే ఇప్పుడు అందరి ద్యాస సమక్షంలోనూ పరోక్షంలోనూ అర్థం వేరనే బేధం అప్పుడు తెలుస్తుంది చివరవరకూ నేనున్నానన్న వారికి కూడా ముఖ్యమైన పనులు చివరి చూపును అందనివ్వవు. తొందర పెట్టే నిప్పులు కుండలోకి చేరాక.. గొల్లుమనే పాటొకటి పాడె మీదకు చేర్చుతుంది. దేహబంధువులు ప్రదక్షిణ చేసి ప్రా...