Skip to main content

Posts

Showing posts from March, 2021

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో రేట్లు తగ్గింపు

 బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యుడు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)పై ఇచ్చే వడ్డీపైనా కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. సీనియర్‌ సిటిజన్ల సేవింగ్‌ పథకాలపై ఇచ్చే వడ్డీని 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 

పాన్-ఆధార్ లింక్.. గడువు పొడగింపు

 పాన్-ఆధార్ లింక్.. గడువు పొడగింపు పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు చివరి తేదీగా ఉంది. తర్వాత లింక్ చేసినట్లయితే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సిఉంటుందని ప్రకటించింది. తాజాగా ఈ గడువు మరోసారి పెంచింది కేంద్రం. కొవిడ్ కారణంగా.. ఈ చివరి తేదీ 30 జూన్ 2021గా మార్చింది. ఇప్పటికీ పాన్- ఆధార్ లింక్ చేసుకోనట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లో చేయాల్సిఉంటుంది.

వైసీపీ లో తీవ్ర విషాదం

వైసీపీ లో తీవ్ర విషాదం..  కడప జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య(62) కన్నుమూత.. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య ఇక లేరు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఎమ్మెల్యే మృతి పట్ల వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #ఆస్పత్రిలో_చికిత్స_పొందుతూ.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేలు నుంచి వైసీపీ తరఫున 35వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు సౌమ్యుడిగా పేరుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కడప జిల్లాలోని సొంత ఊరికి తరలించారు. తాజాగా మరోసారి పరిస్థితి విషమించడంతో ఆయనను కడప జిల్లాలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కన్నుమూశారు. #కుటుంబమంతా_డాక్టర్లే.. వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు కడప జిల్లా అంతటా విషాద ఛాయలు అలముకున్నా...

ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి

 ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి  తెనాలి మార్చి 27 : కళాకారులు జనజీవన గమన నిర్ణేతలని చైతన్య వంతులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అభ్యుదయ కళాసమితి ప్రాంగణంలో బొల్లిముంత ఫౌండేషన్ వేదిక పై జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలకు వైష్ణవి జూనియర్ కళాశాల డైరెక్టర్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగస్థల వైభవం కోసం కళాకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి అడుగు జాడల్లో యువ కళాకారులు ముందుకు వెళ్ళాలని చెప్పారు. ప్రభుత్వాలు కళాకారులను, కళలను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు క్రమశిక్షణ సైనికుల్లాగా తమ ప్రదర్శనలు చేయాలని, సామాజిక సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని ప్రదర్శనలు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎం.సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దర్శకుడు జొన్నల పేరెడ్డి మాట్లాడుతూ కళాకారులు, ప్రజా చైతన్యం కోసం నాటకాలు ప్రదర్శించాలన్నారు. కుల మత, తత్వాలు, రంగం అండగా నిలవాలని హితవు పలికారు. గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మావో, పురుషాధ...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

 

తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

 *తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి మున్సిపాలిటిల‌ను ఒకే కార్పోరేషన్ గా మారుస్తూ ప్రభుత్వ  ఉత్తర్వులు* *ఈ రెండిటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ గా మారుస్తూ  ఉత్తర్వులు ఇచ్చిన పురపాలక శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి* *మంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న11 గ్రామపంచాయితీలను , తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయితీలను కొత్త మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు*  *ఏపీ మున్సిపల్ యాక్టు 1994 ప్రకారం ఈ ప్రాంతాలను కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం*

అమరుల త్యాగాలు స్ఫూర్తి కావాలి

 

కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి

 కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి తెనాలి: బానిసల తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్ కలం పేరుతో పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని 'ఖాకీబతుకులు "నవలగా సజీవంగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్ శాఖలో సంచలనం రేపిన గంటేనపాటి మోహనరావు (68) ఇకలేరు. తెనాలి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్ లోని నివాసంలో ఆదివారం రాత్రి మృతిచెందారు. మధుమేహం కారణంగా గుండె బలహీనమై మరణానికి చేరువ చేసింది. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్ చంద్ ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురు సాహితీవేత్తలు, పట్టణ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు కనపర్తి రత్నాకర్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎస్టీ హెడ్ కానిస్టేబుల్ గా తెనాలిలో పనిచేస్తున్న సమయంలో మోహనరావు ఖాకీబతుకులు నవలను రాశారు. తనకన్నా ముందు 1940-75 మధ్య పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలను తీసుకుని 1980-88 మధ్య రాసిన ఈ నవల, 1998లో పుస్తకరూపం దాల్చింది. పోలీస్ కానిస్టేబుల్ జీవితంలోని ప్రతి పార్శాన్నీ హృదయానికి హత్తుకునేలా అక్షర...

గుడ్ మార్నింగ్ తెనాలి

 

ప్రణామం అర్పిత లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

 

ఏప్రియల్ నుంచి ప్రణామం షూటింగ్

  సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్ఞానశేఖర్ గల్లా నిర్మాతగా తెనాలి పట్టణానికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో ప్రణామం అనే చిత్రం షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రియల్ మొదటి వారం నుంచి తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని నిర్మాత జ్ఞాన శేఖర్ గల్లా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని అతిధి గ్రాండ్లో చిత్ర యూనిట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ చిత్ర కథానాయకి అర్పిత ఆవిష్కరించారు. అర్పిత మాట్లాడుతూ ప్రణామం చిత్రం లో నటించడం సంతోషకరం అన్నారు. అవకాశం కల్పించిన దర్శకుడు రత్నాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.దర్శకులు రత్నాకర్ చిత్ర యూనిట్ సబ్యలను పరిచయం చేసారు.అర్పిత తో పాటు సురభి ప్రభావతి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మధుకర్, సోమేశ్, వసంత యామిని, భవాని తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. అమ్మ సుధీర్ గోగినేని, సామ్రాట్ మాస్టర్లు నృత్య దర్శకత్వం, ఆర్ట్ అపర్ణ చంటి పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు

 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా  (ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్) ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు . రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు. న్యాయవ్యవస్థలో అపార అనుభవం..  జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గోల్డ్ మెడలిస్ట్..  2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకో...

"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (1920-1997)

 "బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (1920-1997) -   బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండే'త్రెలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు. సినిమాల్లొ బుర్రకధల అభినయంకోసం ఎన్.టి.ఆర్, జమున వంటి నటులు కూడా వీరిదగ్గర శిక్షణపొందారు.  పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు.

టి. టి. డి. బాలాజీ వరప్రసాధిని పథకానికి లలిత ట్రేడర్స్ పది లక్షల విరాళం

 

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి

 *17–03–2021,* *అమరావతి.* *రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్‌ పర్సన్, సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సమావేశం.* *హాజరైన కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్‌ ఎం ఏ షరీఫ్, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరు.* *రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్, సభ్యుల పేర్లను ప్రతిపాదించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత.* *ఆమోదం తెలిపిన ఎంపిక కమిటీ* *రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి*   *మానవ హక్కుల కమిషన్‌ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్‌),  న్యాయవాది డాక్టర్‌ జి శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడీషియల్‌).*

మగాడంటే..

 మగాడంటే ...! మగువ కనుపాపైతే  మగాడు కనురెప్ప ! అమ్మ భూమైతే  నాన్న నీలాకాశం కుటుంబం కెరటాలైతే  పురుషుడు కడలి కన్నీటిని కనిపించనీయడు కానీ కన్నీటినీ కురిపిస్తాడు  కనబడని కటిక చీకటిలో కోపమే ఆభరణంగా కనిపించిన  కోమలత్వాన్ని దాస్తాడు  తన మనసులో  క్రమశిక్షణ కోసం కటువుగా  నటించే మహానటుడు  అమ్మ అమృతాన్ని పంచుతుంటే నాన్న హాలాహలమనే  కష్టాలను మింగుతుంటాడు  మగమహారాజని బిరుదుకు  న్యాయం చేయడానికి  నిరంతరం నలిగిపోతూ కుటుంబానికి భరోసా  నేనంటూ అభయమిచ్చే పాలల్లోని వెన్నలాంటివాడే పురుషుడు !                              * సురేంద్ర రొడ్డ *

తెనాలి మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు

 

తెనాలి మునిసిపాలిటీ వైసీపీ కైవసం

 

Pranaamam new film director ratnakar

  ప్రణామం కొత్త సినిమా కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో అర్పిత కథానాయకి గా ప్రణామం అనేనూతన చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది.