"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (1920-1997)

 "బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ (1920-1997)


-  


బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.


ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది,

ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా

ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్,

గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండే'త్రెలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.


సినిమాల్లొ బుర్రకధల అభినయంకోసం ఎన్.టి.ఆర్, జమున వంటి నటులు కూడా వీరిదగ్గర శిక్షణపొందారు.  పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు.