మగాడంటే..


 మగాడంటే ...!

మగువ కనుపాపైతే 

మగాడు కనురెప్ప !

అమ్మ భూమైతే 

నాన్న నీలాకాశం

కుటుంబం కెరటాలైతే 

పురుషుడు కడలి

కన్నీటిని కనిపించనీయడు కానీ

కన్నీటినీ కురిపిస్తాడు 

కనబడని కటిక చీకటిలో

కోపమే ఆభరణంగా కనిపించిన 

కోమలత్వాన్ని దాస్తాడు 

తన మనసులో 

క్రమశిక్షణ కోసం కటువుగా 

నటించే మహానటుడు 

అమ్మ అమృతాన్ని పంచుతుంటే

నాన్న హాలాహలమనే 

కష్టాలను మింగుతుంటాడు 

మగమహారాజని బిరుదుకు 

న్యాయం చేయడానికి 

నిరంతరం నలిగిపోతూ

కుటుంబానికి భరోసా 

నేనంటూ అభయమిచ్చే

పాలల్లోని వెన్నలాంటివాడే పురుషుడు ! 

                            * సురేంద్ర రొడ్డ *