సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్ఞానశేఖర్ గల్లా నిర్మాతగా తెనాలి పట్టణానికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో ప్రణామం అనే చిత్రం షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రియల్ మొదటి వారం నుంచి తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని నిర్మాత జ్ఞాన శేఖర్ గల్లా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని అతిధి గ్రాండ్లో చిత్ర యూనిట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ చిత్ర కథానాయకి అర్పిత ఆవిష్కరించారు. అర్పిత మాట్లాడుతూ ప్రణామం చిత్రం లో నటించడం సంతోషకరం అన్నారు. అవకాశం కల్పించిన దర్శకుడు రత్నాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.దర్శకులు రత్నాకర్ చిత్ర యూనిట్ సబ్యలను పరిచయం చేసారు.అర్పిత తో పాటు సురభి ప్రభావతి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మధుకర్, సోమేశ్, వసంత యామిని, భవాని తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. అమ్మ సుధీర్ గోగినేని, సామ్రాట్ మాస్టర్లు నృత్య దర్శకత్వం, ఆర్ట్ అపర్ణ చంటి పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు
విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్’’ సినిమా యూనిట్ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’ సినిమాను నిర్మించారు. సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....