ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి

 ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలి 

తెనాలి మార్చి 27 : కళాకారులు జనజీవన గమన నిర్ణేతలని చైతన్య వంతులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక అభ్యుదయ కళాసమితి ప్రాంగణంలో బొల్లిముంత ఫౌండేషన్ వేదిక పై జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలకు వైష్ణవి జూనియర్ కళాశాల డైరెక్టర్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగస్థల వైభవం కోసం కళాకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి అడుగు జాడల్లో యువ కళాకారులు ముందుకు వెళ్ళాలని చెప్పారు. ప్రభుత్వాలు కళాకారులను, కళలను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు క్రమశిక్షణ సైనికుల్లాగా తమ ప్రదర్శనలు చేయాలని, సామాజిక సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని ప్రదర్శనలు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎం.సత్యనారాయణ శెట్టి మాట్లాడుతూ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దర్శకుడు జొన్నల పేరెడ్డి మాట్లాడుతూ కళాకారులు, ప్రజా చైతన్యం కోసం నాటకాలు ప్రదర్శించాలన్నారు. కుల మత, తత్వాలు, రంగం అండగా నిలవాలని హితవు పలికారు. గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మావో, పురుషాధిక్యత, తాండవిస్తున్న సమాజంలో మానవీయ తాత్విక స్పృహను ప్రవేశపెట్టే సత్తా జర్మన్ మేధావులు, బెట్రోల్డ్, బ్రెస్ట్, ఫాలో ఫెర్నీ, ఆగస్టో బోలోలాంటి వారందరో నాటక రంగం ద్వార ప్రజలను మేల్కొలిపారన్నారు. కళాసమితి నిర్వాహకులు గోగినేని కేశవరావు, సభ్యులు కళాకారులు రమేష్, బెల్లంకొండ వెంకట్, తాడికొండ జగన్మోహనరావు, బడుగుమోహనరావు, కనపర్తి  మధుకర్, దేవరపల్లి నీలాంబ్రం, మహిళా కళాకారిణిలు వి. హైమావతి, పద్మజా ప్రభాకర్ లను సత్కరించారు




. ఈ సందర్భంగా గాయకులు గేయాలను గానం చేశారు.