ఘనంగా పునరుత్థాన పండుగ ప్రార్ధనలు - శిలువను గెలిచిన రక్షకునికి ఆరాధనలు తెనాలి ఏప్రిల్ 4 (తెనాలి): పట్టణ,పరిసర గ్రామాల్లో అన్ని క్రీస్తు దేవాలయాల్లో క్రీస్తు పునరుత్థాన పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఆయా చర్చీలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.తెల్లవారు జామునుంచే క్రైస్తవ సోదరులు సంప్రదాయబద్ధంగా క్రైస్తవ స్మశాన వాటికలకు చేరుకుని పూర్వికుల సమాధులపై పువ్వులు చల్లి, క్యాండిల్స్ వెలిగించి మృతిచెందిన వారిని స్మరించుకున్నారు.స్థానిక ఐతానగర్,చినరావూరు, రామలింగేశ్వర పేట,పినపాడు తదితర స్మశాన వాటికల్లో ప్రార్ధనలు జరిపారు. వీటితోపాటు తెనాలి నియోజకవర్గంలోని అన్ని క్రైస్తవ స్మశానవాటికల్లో ప్రార్ధనలు జరిగాయి.బోస్ రోడ్ లోని ఎఇఎల్ సి క్రీస్తు దేవాలయం (టౌన్ చర్చి)లో ఉదయం తొమ్మిది గంటలనుంచి పునరుత్థాన పండుగ పవిత్ర ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. చర్చి పాస్టర్లు రెవ.డి.యేసురత్నం,వై. లెనిన్ బాబు,డి. సాల్మన్‌రాజు, యం.వి.బి ప్రకాష్ బాబులు ఈస్టర్ పండుగ ప్రత్యేక వాక్యపఠనం చేసి పాపులను రక్షించుటకు క్రీస్తు శిలువ మరణంపొంది సజీవునిగా మూడవ రోజు తిరిగిలేచాడని ప్రవచించారు. మానవాళి రక్షణ కో...