పలునిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజి కృష్ణ కరకట్టపై ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణ కరకట్ట రోడ్డు విస్తరణ, కరకట్ట బలోపేతం చేయడం, కృష్ణ అవుట్ ఫాల్, స్లుయిచ్ వద్ద డబల్ వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తో కలసి శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జ...