బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది


*తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది..*


◆దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది. 


*తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది..పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిసా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..*


*రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది..* 

- ప్రేమకుమార్


◆దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 


*నాలుగురోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది..*