కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి

కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలి




- ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలతో యువ రచయితలు ముందుకు రావాలని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత నల్లపూసలు బాబ్జీ అన్నారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన ఫిఫ్త్ ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) లో జరిగిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ వర్క్ షాప్ ఆన్ స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. సినిమా కథల రిజిస్ట్రేషన్ విధానం, కాపీ రైట్స్ హక్కుల గురించి వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. సినిమాను సినిమాలా చూడడం కాదని, పుస్తకంలా చదవాలన్నారు. వెండితెరపై తమను తాము ఆవిష్కరించుకునే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని , సినీరంగంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని సినీ పరిశ్రమలో పైకి రావాలన్నారు.ఫిఫ్త్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సంస్థ క్రమశిక్షణ, నిర్వహణా పద్ధతులు, బోధనా విధానం తనకు ఎంతగానో నచ్చిందన్నారు, అందువలనే తన కుమారుడైన అఖిల్ కు  యాక్టింగ్ లో ఇక్కడే  శిక్షణ ఇప్పించానని, ఇప్పుడు తను వెబ్ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడని బాబ్జీ తెలిపారు. భవిష్యత్తులో మరెందరో ఫిఫ్త్  స్టూడెంట్స్ సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో కనిపించాలని ఆయన ఆశీస్సులు అందజేశారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో ఫిఫ్త్ తీసుకుంటున్న జాగ్రత్తలు, విద్యార్థుల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తున్న తీరును బాబ్జీ ప్రశంసించారు. ప్రస్తుత సంక్షోభం తొలగిపోయి త్వరలోనే సినీ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఫిఫ్త్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ  ఉదయ్ కిరణ్ కటకం, యాక్టింగ్ ప్రొఫెసర్, పి. ఆర్.ఓ డాక్టర్ శ్రీజ సాదినేని, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాకల్టీ మరియు ప్లేస్ మెంట్ సెల్ ఇన్ ఛార్జ్ మయాని తరుణ్ , ఫిఫ్త్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.