వన్ టౌన్ సి. ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. చంద్రశేఖర్


 వన్ టౌన్ సి. ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. చంద్రశేఖర్


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి వన్ టౌన్ సి. ఐ గా  కొమ్మాలపాటి చంద్రశేఖర్ మంగళవారం ఉదయం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమంగా తెనాలి పట్టణం లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా తగినచర్యలు తీసుకుంటామన్నారు. మహిళల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ ఆప్ ను తీసుకువచ్చింది యాప్ పై మహిళలకు అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల రక్షణ ద్యేయం గా పనిచేస్తామన్నారు. పై అధికారుల సూచనల మేరకు తెనాలి ప్రాత శాంతి భద్రతలకు బాధ్యతగా పనిచేస్తామన్నారు. గతం లో లా అండ్ ఆర్డర్ విభాగం తో పాటు ఇంటెలీజెన్స్, పోలీస్ ట్రెనింగ్ కళాశాలలో పనిచేసినట్లు తెలిపారు. స్టేషన్ సిబ్బంది సి. ఐ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ ను స్వాగతించి అభినందనలు తెలిపారు.