పలునిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి

 పలునిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి






రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని ప్రకాశం బ్యారేజి కృష్ణ కరకట్టపై ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణ కరకట్ట రోడ్డు విస్తరణ, కరకట్ట బలోపేతం చేయడం, కృష్ణ అవుట్ ఫాల్, స్లుయిచ్ వద్ద డబల్ వంతెన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైటీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తో కలసి శంఖుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కొండవీటి వరద ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ నుండి రాయపూడి వరకు కృష్ణ కుడి కరకట్ట మీదుగా కి.మీ. 15.525 నిడివి గల రెండు వరసల రహదారి నిర్మాణాన్ని రూ. 150 కోట్ల అంచనాలతో చేపట్టనున్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ రావు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణ మూర్తి, కల్పలత, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, రాడిపల్లి తహ శీల్దార్ శ్రీనివాస రెడ్డి, జల వనరుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.