డబ్బింగ్ రంగంలో బోలెడు అవకాశాలు : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వర్ణలత.

 డబ్బింగ్ రంగంలో బోలెడు అవకాశాలు  : ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్  స్వర్ణలత. 


సరైన అవగాహన, రంగం పట్ల ఆసక్తి ఉంటే డబ్బింగ్ లో చాలా అవకాశాలు ఉన్నాయని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ , స్పోర్ట్స్ కామెంటేటర్ జె.ఎస్. స్వర్ణలత అన్నారు. తన ప్రయాణం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న తరువాతే సరైన గుర్తింపు లభించిందని తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజిన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన స్పెషల్ వర్క్ షాప్ లో ఆమె పాల్గొన్నారు. కాబోయే డబ్బింగ్  ఆర్టిస్టులతో మాట్లాడి వాళ్ళకి సరైన గైడెన్స్ అందించారు. . ఈ వర్క్ షాప్ లో భాగంగా విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. జూమ్ సెషన్ ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమం లో దాదాపు 70 మందికి పైగా  పాల్గొన్నారు. భవిష్యత్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు తమకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.  ఈ కార్యక్రమం లో FTIH


సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, FTIH  కల్చరల్ సెక్రటరీ & పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫాకల్టీ హర్షవర్ధన్ రెడ్డి , ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.