కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి భేటీ



కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి భేటీ*

*రైల్ భవన్ లో కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిసిన ముఖ్యమంత్రి  వైయస్.జగన్*

*న్యూఢిల్లీ:*

*–కేంద్ర రైల్వే, వాణిజ్య–పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియ ప్రజాపంపిణీ శాఖలమంత్రి పియూష్‌గోయల్‌తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ.*

– కోవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని వివరించిన సీఎం.

– మరో రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం.

– 2015 డిసెంబర్‌ వరకూ జాతీయ ఆహార భద్రతా చట్టంకింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నారని తెలిపిన సీఎం.

– 2015 డిసెంబర్‌ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96శాతం కుటుంబాలకు, పట్టణాలు–నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే పరిమితంచేసి, బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారన్న సీఎం.

– దీనివల్ల కేవలం 0.91 కోట్ల రేషన్‌ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని, కేటాయింపులను 1,85,640 మెట్రిక్‌ టన్నుల నుంచి 1,54,148 కి తగ్గించారని వెల్లడించిన సీఎం.

– దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపిన ముఖ్యమంత్రి.

– కర్ణాటకలో రూరల్‌లో 76.04శాతం, అర్బన్‌లో 49.36శాతం, గుజరాత్‌లో రూరల్‌లో  76.64శాతం,  అర్బన్‌లో 48.25శాతం,
మహారాష్ట్రలో రూరల్‌లో 76.32శాతం, అర్బన్‌లో 45.34శాతం,
కుటుంబాల ప్రాతిపదికిన వారికి బియ్యం కేటాయిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్దిచెందాయని వివరించిన సీఎం.

– ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక కూడా, రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని, తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం.

– రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించిందని, పారదర్శక పద్ధతిలో రాష్ట్రంలో ఇంటింటా సర్వే జరిపి 1.47 కోట్ల రేషన్‌కార్డు దారులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అమలు చేస్తున్న కార్యక్రమానికి అర్హులని తెలిపిన సీఎం.

ఈ వివరాలు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ కూడా చేశామన్న ముఖ్యమంత్రి.

– తర్వాత కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్‌భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తోంది,

ఇది రాష్ట్రానికి చాలా భారమని, వెంటనే దీన్ని సరిదిద్దాలని కోరిన  ముఖ్యమంత్రి.

–  2020–21 రబీసీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, మద్దతు ధరలను రైతులకు ఇస్తూ, సకాలంలో వాటి పేమెంట్లు రైతులకు అందేలా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన సీఎం.

– ఉచిత రేషన్‌ బియ్యం కింద కేంద్రం, ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు రూ,3,229 కోట్ల రూపాయలు బకాయి పడిందని వెంటనే చెల్లించాలని కోరిన సీఎం.

– ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే..

బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి చెప్పిన సీఎం.