కళాదీపికాంజలి! ●●●●●●●●●● ఈరోజు... ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త డి.ఎస్.దీక్షిత్ గారి 28-7-1956 ◆ 18-2-2019 జయంతి. ●●●●●క●ళా●దీ●పి●క●●●●● "నటన కాదు..వరం..!" -డి.ఎస్.దీక్షిత్ ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ తెలుగునాటకం అనే మాట విన్నప్పుడు, అన్నప్పుడు ఎంత గాంభీర్యంగా ఉంటుందో.. అంతకుమించి సమాజం కోసం లెక్కలేనన్ని బాధ్యతల్నీ ఎన్నో ఏళ్ళుగా తెలుగునాటకం తన భుజాన మోస్తూ వస్తుందనేదీ అక్షర సత్యం. నాటకం అంటేనే సమ్మోహన కళ. ఆ సమ్మోహనంలో చైతన్యాన్ని నింపే సుగంధ కవనాలు, రసరమ్య గమనాలెన్నో. అందుకే 'నాటక కళ' సమాజాన్ని ప్రభావితం చేసే అత్యుత్తమమైన కళల్లో ఒకటయ్యింది. తెలుగు నాటకానికి ఇంతటి ఘనమైన చరిత్రే ఉంది. కళారూపంగానే కాదు, మనో, వైజ్ఞానిక, కళావికాసానికి గళమెత్తిన ఎందరో మేటి నటుల్ని, భవిష్యత్ దార్శనికుల్ని తెలుగు నాటకం ఈ సమాజానికి అందించింది. అలా నాటక కళ కోసం.. నాటకరంగం కళకళలాడటం కోసం.. తనంతట తానుగా, తనతో అనేకమందిగా, నటకులానికే వారథిగా, జీవితాంతం బతికినవాడే డిఎస్ దీక్షిత్ మాష్టార్.. అలియాస్ దీవి శ్రీనివాసా దీక్షిత్. డిఎస్ దీక్షిత్...