29న రెండో విడత విద్యాదీవెన

29న రెండో విడత విద్యాదీవెన

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జగనన్న విద్యాదీవెన పథకం(ఫీజు రీయింబర్స్ మెంట్)లో భాగంగా ఈ నెల 29న రెండో విడత నగదును తల్లుల ఖాతాల్లో రాష్ట్రప్రభుత్వం జమచేయనుంది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, బిటెక్, బీఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని మూడు నెలలకొక్కసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు రూ.67145కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏప్రిల్ 19న ప్రభుత్వం జమచేసింది. ఈ పథకం రెండో విడత కింద సుమారు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81కోటు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
2019-20 విద్యాసంవత్సరంలో విద్యార్ధిని, విద్యార్థులు ఏదైనా కళాశాలకు ఫీజు చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని కళాశాలలు తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.