ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ ఎలా నమోదయ్యే అవకాశాలున్నాయి

ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ ఎలా నమోదయ్యే అవకాశాలున్నాయి ??
======================
ఈ రోజు రాష్టంలో భారీ వర్షాలు కొనసాగుతాయి. ఈ వర్షాలు మోస్తరుగా పడుతాయి, కానీ పడుతునే ఉంటాయి కాబట్టి ఇవి తప్పకుండా భారీ వర్షాలుగా ఉంటాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే వర్షం పడుతునే ఉంది. చాలా చోట్ల నీరు నిలిచిపోయింది.

ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా వర్షాలు పడనున్నాయి. కడప​, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అడపదడప వర్షాలు కొనసాగనున్నాయి. ఎక్కువ వర్షాలు సాయంకాలం/రాత్రి సమయంలో నమోదవ్వనున్నాయి. ఈదురు గాలులు గంటకు 25 kmphr నుంచి  50 kmphr రాష్ట్ర వ్యాప్తంగా వీచే అవకాశాలున్నాయి.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు నమోదవ్వనుంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఎక్కువ వర్షాలు నమోదవ్వనుంది. విశాఖ నగరంలో మాత్రం మేఘావృతమై ఆకాశం, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడనున్నాయి.

తెలంగాణ నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. దీని వల్ల గోదావరి ఉదృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచం అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.