సచివాలయ పనితీరును తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్

సచివాలయ పనితీరును తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ .


తెనాలి పట్టణంలోని 25వ వార్డ్ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు.సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, సిబ్బంది హజరును పరిశీలించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల నమోదును అడ్మిన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ ఆడిట్, సిటిజన్ చార్టర్,సిబ్బంది పనితీరు, అధికారుల సమన్వయం తదితర అంశాలను పరిశీలించినట్లు తెలియజేసారు. ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా సచివాలయ వ్యవస్థ పనిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  అక్కడి నుంచి నేరుగా కళాక్షేత్రంలో జరుగుతున్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వీఆర్వోవోలు,వార్డ్ రెవెన్యూ కార్యదర్సులు శిక్షణలో పాల్గొని ప్రసంగించారు.హాజరైన సిబ్బందికి రికార్డుల నిర్వహణ,తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ కె రవి కుమార్,గుంటూరు తూర్పు మండల తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్ నాధ్,వేమూరు తహసిల్దార్ శిరీష, కొల్లూరు తహసిల్దార్ జాన్ పీటర్, కొల్లిపర తహసిల్దార్ నాంచారయ్య,తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ కె ఆర్ ఆర్ తహసిల్దార్ మెహర్ పలువురు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.